చీర కట్టులో అందంగా రీతూ చౌదరీ.. ఫొటోస్ చూస్తే మతిపోవడం ఖాయం

samatha

10 september 2026

Pic credit - Pinterest

అందాల ముద్దుగుమ్మ క్రేజీ బ్యూటీ రీతూ  చౌదరీ  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం.

బుల్లితెరపై పలు సీరియల్స్‌లలో నటిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు, తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది.

తర్వాత టీవీ షోలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ అమ్మడు లైఫ్ టర్న్ అయ్యింది.

జబర్దస్త్‌లోకి కమెడీయన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తన అందంతోనే కాకుండా స్కిట్లతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

తర్వాత ఏకంగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది. తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెట్టింది ఈ చిన్నది.

బిగ్ బాస్‌లో తన అందం, ఆటతీరుతో ఆకట్టుకుంది.  అంతే కాకుండా 90 రోజుల పాటు ఉండి, చివరలో ఈ బ్యూటీ హౌస్ నుంచి బయటకు వచ్చింది.

తర్వాత బీబీ జోడీలో కూడా పార్టీసిపేట్ చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం పలు షోలో చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా  యాక్టివ్‌గా ఉండే ఈ అందాల బ్యూటీ తాజాగా చీరకట్టులో తన అంద చందాలతో ఆకట్టుకుంది.