Sai Pallavi: ఎంత క్యూట్‏గా పాడింది భయ్యా.. సాయి పల్లవి అదరగొట్టేసింది.. నెటిజన్స్ ఫిదా..

సాయి పల్లవి.. ఈ పేరు వింటే వచ్చే సౌత్ ఇండస్ట్రీలో వచ్చే రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. మలయాళం, తమిళం, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇక ఇప్పుడు అమరన్ సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకుంది. తాజాగా సాయి పల్లవి వీడియోకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Sai Pallavi: ఎంత క్యూట్‏గా పాడింది భయ్యా.. సాయి పల్లవి అదరగొట్టేసింది.. నెటిజన్స్ ఫిదా..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 01, 2024 | 3:51 PM

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకం. ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. గ్లామర్ షో, హేవీ మేకప్ లుక్ కాకుండా న్యాచురల్ యాక్టింగ్‏తో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవికి దక్షిణాదిలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వచ్చిన ప్రతి అవకాశం కాకుండా నటన, పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా మనసుకు నచ్చిన ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా అమరన్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది.

గార్గి సినిమా తర్వాత సాయి పల్లవి నటించిన చిత్రం అమరన్. కోలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఇందులో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్, ఆయన భార్య ఇందు రెబికా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనిపించింది. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రానికి మొదటి నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవికి సంబంధించిన ఓ బ్యూటీఫుల్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

అమరన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ కోలీవుడ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి తనలోని మరో టాలెంట్ బయటపెట్టింది. అందులో శ్రీకృష్ణుడి భజన పాటలను, తమిల్ హిట్ సాంగ్స్ ఎంతో అందంగా ఆలపించింది. ముఖ్యంగా కృష్ణ భజన పాటను సాయి పల్లవి పాడిన తీరుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తూ సాయి పల్లవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.