Jr NTR: ‘అందుకే అన్నా నువ్వంటే మాకిష్టం’.. అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఎన్టీఆర్.. వీడియో చూశారా?

తనను ఈ స్థాయికి తెచ్చిన అభిమానులను ఎంతో గౌరవిస్తారు తారక్. సందర్భమొచ్చినప్పుడల్లా సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలో వారిని కలిసేందుకు సమయం కేటాయిస్తుంటారు. ప్రతి సినిమా ఈవెంట్లో ముగింపులోనూ 'ఇంటికి జాగ్రత్తగా వెళ్లండి అన్నా' అంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి జాగ్రత్తలు చెబుతుంటాడు. అలాగే ఫ్యాన్స్ ఇబ్బందుల్లో ఉంటే 'నేనున్నా' అంటూ ఆపన్న హస్తం అందిస్తాడు.

Jr NTR: 'అందుకే అన్నా నువ్వంటే మాకిష్టం'.. అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఎన్టీఆర్.. వీడియో చూశారా?
Jr NTR
Follow us

|

Updated on: May 14, 2024 | 4:20 PM

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దేశ, విదేశాల్లోనూ ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఇక తనను ఈ స్థాయికి తెచ్చిన అభిమానులను ఎంతో గౌరవిస్తారు తారక్. సందర్భమొచ్చినప్పుడల్లా సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలో వారిని కలిసేందుకు సమయం కేటాయిస్తుంటారు. ప్రతి సినిమా ఈవెంట్లో ముగింపులోనూ ‘ఇంటికి జాగ్రత్తగా వెళ్లండి అన్నా’ అంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి జాగ్రత్తలు చెబుతుంటాడు. అలాగే ఫ్యాన్స్ ఇబ్బందుల్లో ఉంటే ‘నేనున్నా’ అంటూ ఆపన్న హస్తం అందిస్తాడు. ఇక బయటకు వచ్చినప్పుడుల్లా ఎంత బిజీగా ఉన్నా ఎంతో ఓపికగా అభిమానులకు ఫొటోలు, సెల్ఫీలు అందిస్తుంటాడు. అలా తాజాగా ఓటు వేసేందుకు వచ్చిన తారక్ ఓ అభిమాని కోరికను తీర్చాడు. తన కళ్లల్లో ఆనందాన్ని నింపాడు. వివరాల్లోక వెళితే.. సోమవారం ( మే 13) తెలంగాణ లోక్ సభ ఎన్నికలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు క్యూలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ కూడా సికింద్రా బాద్ లోక్ సభ పరిధిలోకి వచ్చే బంజారా హిల్స్ లో తన ఓటు వేశారు. ఆయన వెంట భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి కూడా ఉన్నారు. కాగా ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన ఎన్టీఆర్ ను అభిమానులు, మీడియా చుట్టుముట్టారు.

ఈ సందర్భంగా ఓటు విలువను తెలియజేస్తూ మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్ అనంతరం తన వాహనం దగ్గరకు బయలు దేరారు. ఇంటికి పయనమవుతుండగా.. ‘అన్నా.. అన్నా ఒక ఆటో గ్రాఫ్ ప్లీజ్’ అని ఒక అభిమాని పిలిచాడు. అతని మాటలను విని వెంటనే వెనక్కు తిరిగిన ఎన్టీఆర్ అభిమాని షర్ట్ గుండె భాగంలో ఆటో గ్రాఫ్ ఇచ్చాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ‘అన్నా చాలా థ్యాంక్స్ అన్నా’ అంటూ ఆ అభిమాని తెగ మురిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇంత రద్దీలోనూ ఎంతో ఓపికగా అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
బతికుండగానే వృద్ధుడిని పూడ్చిపెట్టారు.. 4రోజుల తర్వాత తవ్విచూస్తే
బతికుండగానే వృద్ధుడిని పూడ్చిపెట్టారు.. 4రోజుల తర్వాత తవ్విచూస్తే
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
సోషల్ మీడియా ట్రోల్స్‌కు మరో మహిళ బలి
సోషల్ మీడియా ట్రోల్స్‌కు మరో మహిళ బలి
కిర్గిస్థాన్‌లో కొనసాగుతున్న విద్యార్థుల కష్టాలు..!
కిర్గిస్థాన్‌లో కొనసాగుతున్న విద్యార్థుల కష్టాలు..!
రిజల్ట్స్‌కి సమయం దగ్గరపడుతోన్న వేళ ఈసీ యాక్షన్ ప్లాన్‌.. కీలక
రిజల్ట్స్‌కి సమయం దగ్గరపడుతోన్న వేళ ఈసీ యాక్షన్ ప్లాన్‌.. కీలక
వర్షంతో KKR vs SRH మ్యాచ్ రద్దయితే, ఫైనల్‌కు వెళ్లే జట్టు ఏది?
వర్షంతో KKR vs SRH మ్యాచ్ రద్దయితే, ఫైనల్‌కు వెళ్లే జట్టు ఏది?
మద్యం మత్తులో మైనర్.. 200 కి.మీ. స్పీడ్‌తో డ్రైవింగ్.. !
మద్యం మత్తులో మైనర్.. 200 కి.మీ. స్పీడ్‌తో డ్రైవింగ్.. !
మీ డబ్బులకు భరోసా, మంచి రిటర్న్స్‌.. రెండేళ్లలోనే..
మీ డబ్బులకు భరోసా, మంచి రిటర్న్స్‌.. రెండేళ్లలోనే..
ఆ బిజినెస్‌మెన్‌తో మళ్లీ ప్రేమలో పడిన సారా టెండూల్కర్.. ఫొటోస్
ఆ బిజినెస్‌మెన్‌తో మళ్లీ ప్రేమలో పడిన సారా టెండూల్కర్.. ఫొటోస్