AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautam: నిద్రపోతున్నారా..? పసిబిడ్డను అలా ఎందుకు వదిలేశారు.. తాండూరు ఘటనపై రష్మీ రియాక్షన్..

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్‏లో పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆ కుక్కను తల్లిదండ్రులు కొట్టి చంపేశారు. ఈ ఘటన పై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. 'ఇప్పుడు ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రష్మి అంటుంది' అంటూ ట్వీట్ చేశాడు. ఇక అతడి ట్వీట్ కు రష్మీ రియాక్ట్ అవుతూ సుధీర్ఘ ట్వీట్ చేసింది. పిల్లలను కన్న తర్వాత బాధ్యతగా వ్వవహరించాలంటూ కామెంట్ చేసింది.

Rashmi Gautam: నిద్రపోతున్నారా..? పసిబిడ్డను అలా ఎందుకు వదిలేశారు.. తాండూరు ఘటనపై రష్మీ రియాక్షన్..
Rashmi Gautham
Rajitha Chanti
|

Updated on: May 14, 2024 | 5:01 PM

Share

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదోక విషయంపై తన అభిప్రాయాలను తెలియజేస్తుంది. అలాగే జంతువులను హింసించడం.. వాటిపట్ల దారుణంగా ప్రవర్తించేవారిని కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తుంటుంది. తాజాగా తెలంగాణలో జరిగిన పెంపుడు దాడి ఘటనపై రియాక్ట్ అయ్యింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్‏లో పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆ కుక్కను తల్లిదండ్రులు కొట్టి చంపేశారు. ఈ ఘటన పై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. ‘ఇప్పుడు ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రష్మి అంటుంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక అతడి ట్వీట్ కు రష్మీ రియాక్ట్ అవుతూ సుధీర్ఘ ట్వీట్ చేసింది. పిల్లలను కన్న తర్వాత బాధ్యతగా వ్వవహరించాలంటూ కామెంట్ చేసింది.

“తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారు. కుక్క దాడి చేస్తున్న సమయంలో తల్లిదండ్రులు నిద్రపోతున్నారా.. ? చిన్నారి ఏడుపు వారికి వినిపించలేదా.. ? జంతువులపై ఈ చెత్త ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే పేరెంట్స్ కు సంబంధించిన వెయ్యి వీడియోలను షేర్ చేయగలను. పిల్లల జీవితాలను రిస్క్ లో పెట్టింది ఎవరు ? అదే జంతువుల విషయానికి వస్తే మాత్రం లాజిక్స్ అన్ని మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి మీరు మాత్రం ప్రశాంతతను తిరిగి పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పనికాదు.. ” అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇక రష్మిక కామెంట్ కు మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘మీకు బుర్రలేదని అర్థమైంది.. ఇలా ఉంటున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు ‘ అంటూ కామెంట్ చేయగా.. రష్మిక స్పందించింది. ‘నాకు బుర్రలేదు.. కానీ మీకు ఉంది కదా.. కనడమే కాదు. ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లల్ని అలా వదిలేయొద్దు’ అంటూ రియాక్ట్ అయ్యింది.

రష్మి కామెంట్స్ పై మరో నెటిజన్ స్పందిస్తూ.. ’24 గంటలు పిల్లలతోనే ఎవరూ ఉండలేరు. రేపు మీరు కూడా. ఇలాంటివి కేవలం నిమిషంలోనే జరిగే అవకాశం ఉంది. అనుకోకుండా జరుగుతుంటాయి. ‘ అని కామెంట్ చేయగా.. రష్మి స్పందించింది. “మీరు అన్నది కూడా నిజమే. అనుకోకుండా జరుగుతుంటాయి. కానీ ఏదీ కూడా ఒక్క నిమిషంలో జరగదు.. తల్లిదండ్రులు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా చూడాలి. అలాగే బయటి వ్యక్తులపై దాడి చేయకుండా పెంపుడు జంతువులకు యజమానులే శిక్షణ ఇవ్వాలి.. దాడి జరిగితే ఆ పెంపుడు జంతువు యజమానిపై కేసు పెట్టాలి” అంటూ రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం ట్వీట్టర్ ఖాతాలో ఈ అంశంపై వరుసగా ట్వీట్స్ చేస్తుంది రష్మి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.