Tollywood: ఆమె అందానికి ఏకంగా గుడి కట్టిన అభిమానులు.. సౌత్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. గుర్తుపట్టగలరా.. ?

ఒకప్పుడు దక్షిణాదిలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన సినీ తార. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సౌత్ ఇండియాలోనే స్టార్ గా మారింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కీలకపాత్రలు పోషిస్తుంది. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో యాక్టివ్‏గా ఉంటుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా ?. తెలుగులో విక్టరీ వెంకటేశ్ నటించిన ఓసినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. అప్పట్లో ఆమెకు అభిమానులు గుడి కట్టారు. ఎవరో గుర్తుకు వచ్చిందా.. ?

Tollywood: ఆమె అందానికి ఏకంగా గుడి కట్టిన అభిమానులు.. సౌత్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. గుర్తుపట్టగలరా.. ?
Actress 1
Follow us

|

Updated on: May 14, 2024 | 5:14 PM

సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించే వాటిలో త్రోబ్యాక్ చిత్రాలు ఒకటి. సెలబ్రిటీలు తరచుగా తమ మెమరీ ఆల్బమ్‌ల నుండి పాత చిత్రాలను తమ అభిమానులతో పంచుకుంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. వెండితెరపై అందం, అభినయంతో అభిమానులను మెప్పించిన హీరోయిన్. ఒకప్పుడు దక్షిణాదిలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన సినీ తార. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సౌత్ ఇండియాలోనే స్టార్ గా మారింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కీలకపాత్రలు పోషిస్తుంది. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో యాక్టివ్‏గా ఉంటుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా ?. తెలుగులో విక్టరీ వెంకటేశ్ నటించిన ఓసినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. అప్పట్లో ఆమెకు అభిమానులు గుడి కట్టారు. ఎవరో గుర్తుకు వచ్చిందా.. ? పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి సీనియర్ హీరోయిన్ ఖుష్బూ.

ఖుష్బు ముంబైలోని ముస్లిం కుటుంబంలో జన్మించింది. 1980లలో బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. ఖుష్బు నటించిన తొలి చిత్రం ‘తొడిసి బేవఫై’. నసీబ్, లావారీస్, కాలియా, అమితాబ్ బచ్చన్ చిత్రాలలో కూడా ఖుష్బు బాలనటిగా కనిపించింది. తర్వాత ఖుష్బు హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో అగ్రగామి నటీమణుల్లో ఖుష్బు ఒకరు. 2010లో ఖుష్బు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసింది. 100కి పైగా చిత్రాల్లో విశేషమైన పాత్రలు పోషించిన నటి ఖుష్బు రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, వెంకటేశ్, చిరంజీవి వంటి ప్రముఖ నటులతో ఎన్నో పాత్రలు పోషించారు. కన్నడ, తెలుగు, తమిళం. మలయాళ భాషలలో పలు చిత్రాలలో కూడా నటించారు. వెంకటేశ్ జోడిగా కలియుగ పాండవులు చిత్రంలో నటించింది. తమిళంలో ఖుష్బూకు అభిమానులు ఎక్కువే. అప్పట్లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఆమెకు ఆలయాన్ని నిర్మించారు. తమిళనాడులో ఖుష్బూ ఇడ్లీ అనే ఇడ్లీ ఉంది. అలాగే ఖుష్బు అనే చీర బ్రాండ్ కూడా ఉంది.

కథానాయికగా కొనసాగుతున్న సమయంలోనే కోలీవుడ్ నటుడు ప్రభును ప్రేమ వివాహం చేసుకుంది. కానీ అప్పటికే ప్రభుకు పెళ్లికావడంతో ఏడాదికే వీరు విడిపోయారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు సుందర్‌ను ఖుష్బు వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఖుష్బు హిందూ మతంలోకి మారింది. ఖుష్బుకు అవందిక, ఆనందిత అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్నతనంలో ఎదుర్కొన్న సమస్యలే ఖుష్బుకు ధైర్యం తెచ్చాయని ఆమె భర్త సుందర్ అన్నారు.

View this post on Instagram

A post shared by Avni Media (@avnimedia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..