AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్న కోళ్ల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సదుం మండలాల్లోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా ఇప్పుడు కార్వేటి నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. RKV పేట, ఇందిరా కాలనీ కోళ్ల ఫారంలో వేల సంఖ్యలో మరణించిన కోళ్లను జిల్లా యంత్రాంగం గుర్తించింది.

విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!
Poultry Farms
Raju M P R
| Edited By: |

Updated on: Feb 10, 2026 | 7:47 AM

Share

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్న కోళ్ల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సదుం మండలాల్లోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా ఇప్పుడు కార్వేటి నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. RKV పేట, ఇందిరా కాలనీ కోళ్ల ఫారంలో వేల సంఖ్యలో మరణించిన కోళ్లను జిల్లా యంత్రాంగం గుర్తించింది. వాటిని తగిన జాగ్రత్తలతో పూడ్చి పెడుతోంది.

సోమవారం (ఫిబ్రవరి 9) ఒక్కరోజే వెయ్యికి పైగా కోళ్లు మరణించడంతో ఆందోళన కలిగిస్తుంది. దీంతె అధికారులకు స్థానికులు, పౌల్ట్రీ ఫామ్ యజమానులు సమాచారం ఇచ్చారు. కోళ్ల మరణాలను అధికారులు వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.గ్రామాన్ని సందర్శించాలని పశు సంవర్త శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించగా కోళ్ల ఫారాలను పరిశీలించి వివరాలను, బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి పై పశుసంవర్ధక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే మరణించిన కోళ్లను జేసీబీల తో పెద్ద గొయ్యి తవ్వి పాతిపెట్టినట్లు అధికారులు అధికారులు తెలిపారు. కోళ్ల సామూహిక మరణాలకు గల కారణాలపై ప్రాథమికంగా విచారణ చేపట్టారు. వ్యాధి నిర్ధారణ కోసం కోళ్ల బ్లడ్ శాంపిల్స్ ను భోపాల్ లోని ల్యాబ్ కు పంపిన అధికారులు కోళ్ల మరణాలకు గల కారణాలు తెలిసేంతవరకు కోడి గుడ్లను, కోళ్లను ఎవరికి అమ్మకూడదని ఆదేశించారు. అలాగే కోళ్ల ఫారం లోకి ఇతరులను, వాహనాలను అనుమతించవద్దని యజమానులకు అధికారులు ఆదేశించారు.

మరోవైపు చిత్తూరు జిల్లాలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ భయంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక రాపిడ్ టీం ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. టెలి కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసారు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ కోసం శాంపిల్స్ ఎన్ ఐ హెచ్ ఎస్ ఏ డి కి పంపిన అధికారులు పౌల్ట్రీ ఫార్మ్ నిర్వహకులు బయో సెక్యూరిటీ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.

జిల్లాలో వేల సంఖ్యలో కోళ్ల ఫారాలు ఉండగా లక్షల సంఖ్యలో కోళ్ల పెంపకం కొనసాగుతుంది. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కోళ్ల ఎగుమతి కొనసాగుతుండడంతో బర్డ్ ఫ్లూ విస్తరిస్తే కోళ్ల పరిశ్రమ కుదేలయ్యే అవకాశం ఉందని భావిస్తున్న అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. బర్డ్ ఫ్లూ మాయ రోగం వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలుపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక రూపంలో తెలియజేస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు