AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs PAK: గుంటనక్క పాక్ గుటుక్కుమంది.. ఫిబ్రవరి 15 భారత్‌తో మ్యాచ్ ఆడుతోంది.. ఇది కిక్కిచ్చే న్యూస్..

క్రికెట్ లవర్స్ కోరిక నెరవేరబోతోంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండో పాక్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదంటూ బెట్టు చేసిన దాయాది దేశం.. చర్చల అనంతరం చేసేదేమీ లేక గ్రౌండ్‌లో దిగేందుకు ఓకే చెప్పింది.

IND Vs PAK: గుంటనక్క పాక్ గుటుక్కుమంది.. ఫిబ్రవరి 15 భారత్‌తో మ్యాచ్ ఆడుతోంది.. ఇది కిక్కిచ్చే న్యూస్..
2021లో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్, 2022 టీ20 ప్రపంచ కప్‌లో పాత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో, పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత్ చివరి బంతికి 6 వికెట్లు కోల్పోయి గెలిచింది.
Ravi Kiran
|

Updated on: Feb 10, 2026 | 7:38 AM

Share

పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటిస్తూ వచ్చిన పాక్… ఇప్పుడు తన నిర్ణయం మార్చుకుంది. భారత్‌తో జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్‌.. లేటెస్ట్‌గా మనసు మార్చుకుంది. ఈ అంశంలో పాక్‌తో చర్చలు జరిపేందుకు ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖ్వాజా లాహోర్‌ వెళ్లారు. అక్కడ పీసీబీ, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు సభ్యులతో ఆయన సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే వెనక్కి తగ్గి మ్యాచ్‌ ఆడేందుకు పాక్ అంగీకరించింది.

చర్చల్లో భాగంగా పీసీబీ పలు ప్రతిపాదనలు ఐసీసీ ముందు ఉంచింది. భారత్‌- పాక్‌- బంగ్లాదేశ్‌ మధ్య త్రైపాక్షిక సిరీస్‌ నిర్వహించాలని కోరింది. అయితే ఐసీసీ తిరస్కరించింది. మరోవైపు టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్థాన్‌ను అభ్యర్థించింది. క్రికెట్‌ వ్యవస్థ ప్రయోజనం కోసం భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగాలని అభిప్రాయపడింది. షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌ ఆడాలని పీసీబీని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న శ్రీలంకలోని కొలంబోలో భారత్‌, పాక్‌ మధ్య టీ20 మ్యాచ్ జరిగేందుకు లైన్‌ క్లియర్ అయ్యింది.

Follow Us