AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026లో పంజాబ్ ప్రభంజనం.. పాయింట్ల పట్టికను శాసిస్తున్న శ్రేయస్ అయ్యర్ సేన

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. చెన్నైపై భారీ విజయం తర్వాత పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు టాప్ లో ఉన్న రాజస్థాన్ రెండో స్థానానికి పడిపోయింది.

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026లో పంజాబ్ ప్రభంజనం.. పాయింట్ల పట్టికను శాసిస్తున్న శ్రేయస్ అయ్యర్ సేన
Punjab Kings
Rakesh
|

Updated on: Apr 04, 2026 | 7:31 AM

Share

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే అసలైన మజాను అందిస్తోంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. చెన్నై సూపర్ కింగ్స్ కంచుకోటగా భావించే చెపాక్ స్టేడియంలోనే సిఎస్‌కేకు చుక్కలు చూపించి, చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు కనిపిస్తోంది. తన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన పంజాబ్, ఇప్పుడు బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించింది. చెన్నై నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే ఛేదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ గెలుపుతో పంజాబ్ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి, అలాగే నెట్ రన్ రేట్ కూడా +0.637 కి మెరుగుపడింది. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ వంటి జట్లను వెనక్కి నెట్టి పంజాబ్ కింగ్స్ టేబుల్ టాప్‌లో నిలిచింది.

టాప్-5లో ఉన్న జట్లు ఇవే

ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న జట్లను గమనిస్తే పంజాబ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ గెలిచి 4 పాయింట్లతో (+0.637 NRR) మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాచ్ ఆడి ఒక గెలుపుతో 2 పాయింట్లు (+4.171 NRR) కలిగి రెండో స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఒక మ్యాచ్‌లో గెలిచి 2 పాయింట్లు (+2.907 NRR) తో మూడో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 2 పాయింట్లు (+1.397 NRR)తో నాలుగో స్థానంలో, ముంబై ఇండియన్స్ 2 పాయింట్లు (+0.687 NRR) తో ఐదో స్థానంలో ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ కు దెబ్బ మీద దెబ్బ

మరోవైపు ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా మారింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలవ్వడంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగున అంటే 10వ స్థానంలో నిలిచింది. తన సొంత మైదానంలో కూడా ఓడిపోవడం సిఎస్‌కే అభిమానులను కలవరపెడుతోంది. చెన్నైతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా తమ మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి కష్టాల్లో ఉన్నాయి. ఇక లీగ్ దశలో పుంజుకోవాలంటే వచ్చే మ్యాచ్‌ల్లో చెన్నై భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది.

తాజా విశ్లేషణల ప్రకారం, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ ఈసారి చాలా పటిష్టంగా కనిపిస్తోంది. యువ ఆటగాళ్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ అందిస్తున్న శుభారంభాలు జట్టుకు పెద్ద ప్లస్ అవుతున్నాయి. అలాగే రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ ఒకే మ్యాచ్ ఆడినప్పటికీ భారీ నెట్ రన్ రేట్‌ను కలిగి ఉండటంతో, అవి తమ తదుపరి మ్యాచ్‌ల్లో గెలిస్తే పంజాబ్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పట్టికలో ఆరు జట్లు రెండేసి పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉండటంతో ప్లేఆఫ్స్ రేసు ఇప్పుడే వేడెక్కుతోంది.

తాజా పాయింట్ల పట్టిక (ఏప్రిల్ 4, 2026 వరకు)

పంజాబ్ కింగ్స్: 2 మ్యాచ్‌లు, 2 విజయాలు, 4 పాయింట్లు, NRR +0.637

రాజస్థాన్ రాయల్స్: 1 మ్యాచ్, 1 విజయం, 2 పాయింట్లు, NRR +4.171

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 1 మ్యాచ్, 1 విజయం, 2 పాయింట్లు, NRR +2.907

ఢిల్లీ క్యాపిటల్స్: 1 మ్యాచ్, 1 విజయం, 2 పాయింట్లు, NRR +1.397

ముంబై ఇండియన్స్: 1 మ్యాచ్, 1 విజయం, 2 పాయింట్లు, NRR +0.687

లక్నో సూపర్ జెయింట్స్: 1 మ్యాచ్, 0 విజయాలు, 0 పాయింట్లు

గుజరాత్ టైటాన్స్: 1 మ్యాచ్, 0 విజయాలు, 0 పాయింట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్: 1 మ్యాచ్, 0 విజయాలు, 0 పాయింట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్: 2 మ్యాచ్‌లు, 0 విజయాలు, 0 పాయింట్లు

చెన్నై సూపర్ కింగ్స్: 2 మ్యాచ్‌లు, 0 విజయాలు, 0 పాయింట్లు

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us