BBL: ఇండియాలో బిగ్ బాష్ లీగ్.. అధికారికంగా ప్రకటించనున్న ప్రధాని మోదీ!
ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్ బాష్ లీగ్ 2026లో భారత్‌లో ప్రారంభం కానుంది. తమ మార్కెట్‌ను విస్తరించుకునే క్రమంలో బీబీఎల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకోగా, బీసీసీఐ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటనలో దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఐపీఎల్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు, సక్సెస్‌ఫుల్ లీగ్ అయిన బీబీఎల్(బిగ్ బాష్ లీగ్) 2026 సీజన్ మన దేశంలో ప్రారంభం కానుంది. తన మార్కెట్ మరింత విస్తరించుకునే క్రమంలో బీబీఎల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి బీసీసీఐ కూడా ఇప్పటికే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
వచ్చే నెల అంటే జూలై 8 నుంచి 10 తేదీ వరకు ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిడ్నీలో ప్రధాని దీనిపై ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ ఏడాది చివర్లో బిగ్ బాష్ లీగ్ ఇండియాలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ ఓపెనింగ్ మ్యాచ్ కోసం చెన్నైలోని చెపాక్ స్టేడియాన్ని వేదికగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అంటే ధోని అడ్డాలో బిగ్ బాష్ లీగ్ ప్రారంభం కానుదన్న మాట. అయితే టోర్నీ మొత్తం ఇక్కడే నిర్వహిస్తారా? లేక ఆరంభ మ్యాచ్ మాత్రమేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అలాగే బిగ్ బాష్ లీగ్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు పాల్గొంటే.. మరి వారికి ఇండియాలో ఆడేందుకు అనుమతి ఇస్తారా? లేదా అనే విషయాలపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా భారత క్రికెట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం, గుర్తింపును పెంచుకోవడంపై అధికంగా దృష్టి సారిస్తోంది. ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్రాంచైజీలలో వాటాలను కొనుగోలు చేయడానికి భారత కార్పొరేట్ దిగ్గజాలు గణనీయమైన ఆసక్తిని కనబరుస్తున్న నేపథ్యంలో బీబీఎల్ ప్రైవేటీకరణకు సంబంధించి జరుగుతున్న విస్తృత చర్చలకు అనుగుణంగా ఈ చర్య ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
