AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1, 2 కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్.. ఆ రెండు జట్లు ఏవో తెలిస్తే షాకే..!

First no Ball in Cricket: గాలే టెస్టులో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన నో బాల్స్ చర్చనీయాంశంగా మారాయి. శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా వికెట్ తీసినా, అది నో బాల్ కావడంతో జడేజా విమర్శలపాలయ్యాడు. ఈ నేపథ్యంలో, అసలు క్రికెట్ చరిత్రలో తొలి నో బాల్ ఎప్పుడు వేశారు? అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్ ఎవరు? లాంటి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

1, 2 కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్.. ఆ రెండు జట్లు ఏవో తెలిస్తే షాకే..!
First No Ball In Cricket
Venkata Chari
|

Updated on: Aug 20, 2026 | 12:10 PM

Share

First no Ball in Cricket: క్రికెట్ చరిత్రలో తొలి నో బాల్ రికార్డు జాన్ విల్స్ పేరిట ఉంది. సరిగ్గా 204 ఏళ్ల క్రితం, అంటే జులై 15, 1822లో లార్డ్స్ మైదానంలో కెంట్, ఎంసీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ కాలంలో కేవలం అండర్ ఆర్మ్ బౌలింగ్‌కు మాత్రమే అనుమతి ఉండేది. అయితే, జాన్ విల్స్ తన సోదరి క్రిస్టినాతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ రౌండ్ ఆర్మ్ బౌలింగ్ నేర్చుకున్నాడు. మ్యాచ్‌లో అదే విధంగా బౌలింగ్ చేయడంతో, అంపైర్ దానిని అక్రమ బౌలింగ్ యాక్షన్‌గా పరిగణించి నో బాల్‌గా ప్రకటించాడు. క్రికెట్ చరిత్రలో అంపైర్ నో బాల్ ఇవ్వడం అదే తొలిసారి.

ఒకే మ్యాచ్‌లో వందకు పైగా..

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక నో బాల్స్ నమోదైన మ్యాచ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 1977లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 103 నో బాల్స్ నమోదయ్యాయి. ఒకే టెస్టులో వందకు పైగా నో బాల్స్ వేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలి, ఆఖరిసారి. ఆ తర్వాత 1988లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 90 నో బాల్స్ నమోదవడం గమనార్హం.

ఎక్కువమంది చదివినది: SL vs IND: లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ ప్యాక్ చేసుకుని ఇంటికెళ్లుడు పక్కా..!

ఇవి కూడా చదవండి

ఆ చెత్త రికార్డు బ్రెట్ లీ దే..

ఇక వ్యక్తిగతంగా టెస్టుల్లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టార్ బ్రెట్ లీ అగ్రస్థానంలో ఉన్నాడు. తన సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో అతడు ఏకంగా 472 నో బాల్స్ వేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్ 325 నో బాల్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. భారత బౌలర్ల విషయానికొస్తే, వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ అత్యధికంగా 314 నో బాల్స్ వేసి ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..?

గీత దాటడం బౌలర్లకు ఎప్పుడూ నష్టమే. జడేజా నో బాల్ కారణంగా వికెట్ కోల్పోయినట్లే, గతంలో ఎంతో మంది బౌలర్లు కీలక సమయాల్లో నో బాల్స్ వేసి మూల్యం చెల్లించుకున్నారు. బౌలర్లు తమ రనప్‌పై దృష్టి సారించి, క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తేనే ఇలాంటి తప్పులను నివారించగలుగుతారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
అరుంధతిలో విలన్‌గా నేనే చేయాల్సింది.. కానీ
అరుంధతిలో విలన్‌గా నేనే చేయాల్సింది.. కానీ
ఇంట్లో ఇత్తడి వినాయకుడి విగ్రహాన్ని ఏ దిశలో, ఎక్కడ ఉంచాలి?
ఇంట్లో ఇత్తడి వినాయకుడి విగ్రహాన్ని ఏ దిశలో, ఎక్కడ ఉంచాలి?
RRB రైల్వేలో 1200 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
RRB రైల్వేలో 1200 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
గ్లోబల్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..
గ్లోబల్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..
ధన్‌తేరస్ నవంబర్ 6 లేదా 7న? పూజా ముహూర్తం, బంగారం కొనుగోలు శుభ..
ధన్‌తేరస్ నవంబర్ 6 లేదా 7న? పూజా ముహూర్తం, బంగారం కొనుగోలు శుభ..
ఆ ఒక్క హీరోతోనే మూడు సినిమాలు చేయాల్సింది మిస్ అయ్యా..
ఆ ఒక్క హీరోతోనే మూడు సినిమాలు చేయాల్సింది మిస్ అయ్యా..
ఇంట్లోనే ఈజీగా 100శాతం స్వచ్ఛమైన రోజ్‌వాటర్‌ తయారు చేసుకోండిలా!
ఇంట్లోనే ఈజీగా 100శాతం స్వచ్ఛమైన రోజ్‌వాటర్‌ తయారు చేసుకోండిలా!
దీపావళి ఎప్పుడు? లక్ష్మీ పూజ ముహూర్తం, పండుగ ప్రాముఖ్యత..
దీపావళి ఎప్పుడు? లక్ష్మీ పూజ ముహూర్తం, పండుగ ప్రాముఖ్యత..
రామాయణం 'రావణ తాండవం' సాంగ్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన యశ్
రామాయణం 'రావణ తాండవం' సాంగ్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన యశ్
రోజూ పచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య లాభలో..
రోజూ పచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య లాభలో..