AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.. అసలు కారణం ఇదే..?

Vaibhav Suryavanshi: భారత దేశవాళీ క్రికెట్ సీజన్ దలీప్ ట్రోఫీతో ఆగస్టు 23న ఘనంగా ప్రారంభం కానుంది. అయితే, ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వేదికను బీసీసీఐ అనూహ్యంగా మార్చేసింది. ముందుగా నిర్ణయించిన బెంగళూరుకు బదులుగా ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ పోరుకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే?

బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.. అసలు కారణం ఇదే..?
Duleep Trophy Final Venue
Venkata Chari
|

Updated on: Aug 19, 2026 | 8:04 PM

Share

Duleep Trophy Final Venue: దలీప్ ట్రోఫీ 2026 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ జూలైలోనే ప్రకటించింది. ఐదు జోన్ల జట్లు బరిలోకి దిగుతున్న ఈ టోర్నీ మ్యాచ్‌లన్నీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ – CoE)లో జరగాల్సి ఉంది. అక్కడి అత్యాధునిక సదుపాయాల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోకి ప్రేక్షకులకు అనుమతి లేదు. భారత స్టార్ క్రికెటర్లు ఆడుతున్న ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా నిరసనలు వ్యక్తమవడంతో, నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని బీసీసీఐపై ఒత్తిడి పెరిగింది.

అభిమానుల కోసం వేదిక మార్పు..

అభిమానుల కోరికను మన్నించిన బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లను బెంగళూరులోనే నిర్వహించినప్పటికీ, ఫైనల్ మ్యాచ్ వేదికను మాత్రం మార్చింది. స్టార్ ఆటగాళ్ల ఆటను వీక్షించేందుకు వీలుగా ఫైనల్ మ్యాచ్‌ను చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియానికి తరలించినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఫైనల్ రోజున చెపాక్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..?

ఇవి కూడా చదవండి

ఆకర్షణగా 15 ఏళ్ల సంచలనం..

ఈ దలీప్ ట్రోఫీలో అందరి దృష్టీ ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీపైనే నెలకొంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంతటి ప్రతిష్టాత్మక టోర్నీలో వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎర్ర బంతితో ఈ యువ సంచలనం ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈస్ట్ జోన్ ఫైనల్‌కు చేరితే, వైభవ్‌కు చెపాక్ స్టేడియం మరోసారి అచ్చొచ్చే అవకాశం ఉంది. ఇదే మైదానంలో 2024లో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై భారత అండర్-19 తరఫున ఆడిన వైభవ్ కేవలం 62 బంతుల్లోనే 104 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు.

ఎక్కువమంది చదివినది: SL vs IND: లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ ప్యాక్ చేసుకుని ఇంటికెళ్లుడు పక్కా..!

దేశవాళీ క్రికెట్‌కు ఊపిరిలూదే దలీప్ ట్రోఫీ ఫైనల్‌ను అభిమానులకు చేరువ చేయడం బీసీసీఐ తీసుకున్న మంచి నిర్ణయం. స్టార్ ఆటగాళ్లతో పాటు వైభవ్ సూర్యవంశీ లాంటి యువ కెరటాలు చెపాక్ మైదానంలో ఎలా రాణిస్తారో చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us