AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం ధరల్లో ఊహించని మార్పు.. సామాన్యులకు ఊరట..!

Gold, Silver Prices: ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజుకు రెండు సార్లు బంగారం, వెండి ధరలు అప్‌డేట్‌ అవుతుంటాయి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు కొనుగోలు చేసే సమయానికి ధర ఎంత ఉందో ముందుగానే..

Gold Price Today: బంగారం ధరల్లో ఊహించని మార్పు.. సామాన్యులకు ఊరట..!
Gold Price Today
Subhash Goud
|

Updated on: Sep 28, 2026 | 6:22 AM

Share

Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి రోజు ఊహించని విధంగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సెప్టెంబర్ 28, 2026 బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల పరుగులు పెట్టిన పసిడి ధరలు.. గత మూడు, నాలుగు రోజుల నుంచి మళ్లీ దిగి వస్తున్నాయి. బంగారం ధరలు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. ఈ రోజు 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర సుమారు 1.52 లక్షలు ఉండగా, 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం సుమారు రూ.1.39 లక్షలకు కొనసాగుతోంది.

వెండి ధర కూడా కిలోగ్రాముకు సుమారు రూ. 2.45 లక్షల వద్ద ఉంది. నగరం, నగల వ్యాపారిని బట్టి బంగారం, వెండి ధరలలో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని గమనించాలి. ఎందుకంటే వివిధ నగరాలలో జీఎస్టీ, ఇతర ఛార్జీలను బట్టి ధరల్లో తేడా ఉంటుంది.

Cooktop: ఇండక్షన్ కుక్‌టాప్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలుసా? ఇలా అస్సలు చేయకండి!

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.

ఇతర నగరాల్లో..

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,820 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.
  3. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.
  4. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,720 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,990 వద్ద కొనసాగుతోంది.
  5. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.
  6. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్‌, కేరళ, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతుండగా, డిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాతో సహా ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.

ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజుకు రెండు సార్లు బంగారం, వెండి ధరలు అప్‌డేట్‌ అవుతుంటాయి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు కొనుగోలు చేసే సమయానికి ధర ఎంత ఉందో ముందుగానే తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇది కూడా చదవండి: SIM: మీ ఆధార్‌పై ఎవరైనా సిమ్ తీసుకున్నారా? కేవలం 5 నిమిషాల్లో కనిపెట్టేయండి..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us