AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌గా డాక్యుమెంట్రీల పిచ్చోడు! ఒక్క సిక్స్ కొట్టి ఊరంతా చెప్పుకునే రకం..

2026 ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. సాహిబ్జాదా ఫర్హాన్‌కు కెప్టెన్సీ అప్పగించగా, బాబర్ అజమ్, షహీన్ అఫ్రిది, సల్మాన్ అలీ అఘా వంటి సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టింది. భవిష్యత్ జట్టును తీర్చిదిద్దే లక్ష్యంతో యువ ప్రతిభకు అవకాశం కల్పిస్తున్నట్లు PCB వెల్లడించింది.

పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌గా డాక్యుమెంట్రీల పిచ్చోడు! ఒక్క సిక్స్ కొట్టి ఊరంతా చెప్పుకునే రకం..
Sahibzada Farhan
SN Pasha
|

Updated on: Jun 10, 2026 | 12:21 PM

Share

సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 14 వరకు జపాన్‌లో జరగనున్న 2026 ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఎంపికలో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయడం విశేషం. ఫలితంగా జట్టు మాజీ కెప్టెన్ బాబర్ అజమ్, స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది, సల్మాన్ అలీ అఘా వంటి సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఓపెనింగ్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్‌ను కెప్టెన్‌గా నియమించగా, అబ్దుల్ సమద్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. 30 ఏళ్ల ఫర్హాన్ పాకిస్థాన్ తరఫున 46 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 1,305 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన 2026 టీ20 ప్రపంచకప్‌లో కూడా అతడు అద్భుత ప్రదర్శన కనబరిచి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే ఫర్హాన్‌కు ఒక పిచ్చి ఉంది. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు దానిపై ఒక డాక్యుమెంటరీనే తీస్తాడు. ఓ సారి జస్రీత్

ఆసియా క్రీడల జట్టులో నలుగురు ఆటగాళ్లు ఇప్పటివరకు పాకిస్థాన్ తరఫున ఒక్క టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. అకిఫ్ జావేద్, అలీ రజా, మాజ్ సదాకత్, సాద్ మసూద్‌లకు తొలిసారి పెద్ద టోర్నమెంట్‌లో అవకాశం లభించింది. యువ ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబ వెల్లడించింది. ఇక పాకిస్థాన్ ఇటీవల అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 2026 టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశలోనే నిష్క్రమించిన ఆ జట్టు, ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి పాలైంది. వరుసగా రెండు ప్రధాన టోర్నమెంట్లలో నిరాశ ఎదురుకావడంతో జట్టులో మార్పులు చేసి యువ రక్తానికి అవకాశం ఇవ్వాలని పీసీబీ నిర్ణయించింది. ఆసియా క్రీడల్లో ఈ యువ జట్టు ఎలా రాణిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పాకిస్తాన్ స్క్వౌడ్

సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అబ్దుల్ సమద్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, అకిఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్ మిన్హాస్, హైదర్ అలీ, హసన్ నవాజ్, మాజ్ సదాకత్, మహ్మద్ సల్మాన్ మీర్జా, సాద్ మసూద్, సైమ్ అయూబ్, సుఫ్యాన్కే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us