AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..

వర్షాకాలంలో కొన్ని వ్యాపారాలకు భారీ డిమాండ్ ఉంటుంది. గొడుగులు, రెయిన్‌కోట్లు, హాట్ స్నాక్స్, టీ స్టాల్స్, హోమ్ డెలివరీ సేవలు, వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తులు, దోమల నివారణ వస్తువుల విక్రయం వంటి వ్యాపారాలను తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలు పొందవచ్చు. సీజన్‌కు అనుగుణంగా వ్యాపారాన్ని ఎంపిక చేసుకుంటే ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి.

Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..
Monsoon Business Ideas
SN Pasha
|

Updated on: Jun 10, 2026 | 1:34 PM

Share

వర్షాకాలం వచ్చిందంటే చాలామంది బిజినెస్‌లు డల్ అవుతాయని భావిస్తారు. అయితే కొన్ని వ్యాపారాలకు మాత్రం ఇదే సీజన్ బంగారం లాంటి అవకాశాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలు పొందాలనుకునే వారికి వర్షాకాలం అనేక అవకాశాలను అందిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే చిన్న వ్యాపారాన్ని లాభదాయకమైన ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. అలాంటి ఐదు డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియాలు ఇవే.

1. గొడుగులు, రెయిన్‌కోట్లు, వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తుల విక్రయం.. వర్షాలు ప్రారంభం కాగానే వీటికి భారీ డిమాండ్ ఉంటుంది. హోల్‌సేల్ మార్కెట్ల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి రిటైల్‌గా విక్రయిస్తే మంచి లాభాలు పొందవచ్చు.

2. హాట్ స్నాక్స్, టీ స్టాల్.. వర్షపు వాతావరణంలో వేడి వేడి బజ్జీలు, పకోడీలు, మిర్చి బజ్జీలు, టీ, కాఫీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఈ వ్యాపారం రోజువారీ ఆదాయాన్ని అందిస్తుంది.

3. హోమ్ డెలివరీ కూరగాయలు, కిరాణా సేవలు.. వర్షాల కారణంగా బయటకు వెళ్లడానికి ఇష్టపడని వారు ఇంటికే సరుకులు తెప్పించుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. స్థానికంగా డెలివరీ సేవలు అందించడం ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు.

4. వాటర్‌ప్రూఫ్ మొబైల్, ల్యాప్‌టాప్ కవర్ల విక్రయం.. వర్షాకాలంలో ఎలక్ట్రానిక్ పరికరాలను రక్షించేందుకు ప్రజలు ప్రత్యేక కవర్లు, బ్యాగులు కొనుగోలు చేస్తుంటారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈ ఉత్పత్తులను విక్రయించవచ్చు.

5. దోమల నివారణ ఉత్పత్తుల వ్యాపారం.. వర్షాకాలంలో దోమల సమస్య ఎక్కువగా ఉండటంతో మస్కిటో రిపెలెంట్లు, దోమల వలలు, స్ప్రేలు, లిక్విడ్ వెపరైజర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us