AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks: రూ. 500కే 1000 షేర్లు.. ఆత్రంగా కొన్నారంటే కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే

స్టాక్ మార్కెట్‌లో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారు మొదటిగా మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడాలి. ఏ స్టాక్స్ లాంగ్ టర్మ్‌కు ఉపయోగపడతాయి. ఏయే స్టాక్స్‌కు దూరంగా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ సారి చూసేయండి.

Stocks: రూ. 500కే 1000 షేర్లు.. ఆత్రంగా కొన్నారంటే కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే
Stocks
Ravi Kiran
|

Updated on: Feb 10, 2026 | 9:01 AM

Share

స్టాక్ మార్కెట్‌లో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారు ఇవి కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తుంటే.. ఏయే స్టాక్స్ భవిష్యత్తులో మంచి రాబడిని అందిస్తాయో తెలుసుకోవాలి. సత్యం, ఎస్ బ్యాంక్, రిలయన్స్ పవర్, సుజ్లాన్, వోడాఫోన్ ఐడియా, పీసీ జ్యువెలర్స్, వక్రంజీ వంటి అనేక కంపెనీల విషయంలో గతంలో పెట్టుబడిదారులకు చేదు అనుభవాలను చూపించాయి. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా.. రాత్రికి రాత్రి కొంపకొల్లేరు చేశాయి.

ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే.. ఇన్వెస్టర్లు కచ్చితంగా కంపెనీల ఆర్థిక స్థితిని, ముఖ్యంగా ప్రమోటర్ల స్థితిగతులను పరిశీలించాలి. ఇటీవల జెన్సోల్ ఇంజనీరింగ్ కేసు స్కామ్‌లను ఎలా గుర్తించాలో స్పష్టంగా చూపిస్తుంది. ఈ కంపెనీ మొదట సోలార్ రంగంలో పనిచేసి, ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలోకి ప్రవేశించింది. బ్లూ స్మార్ట్ పేరుతో విస్తరించింది. ఈవీ కంపెనీలకు రుణాలు అందించే IREDA, PFC వంటి సంస్థల నుంచి భారీ రుణాలు పొందింది. కంపెనీ అద్భుతమైన వృద్ధిని చూపుతున్నప్పటికీ, ప్రమోటర్లు తమ వాటాను తగ్గించుకోవడం, తాకట్టు పెట్టడం వంటివి చేశారు. ఇదే సమయంలో, బ్లూ స్మార్ట్ రూ. 30 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైంది, సెబీకి ఫిర్యాదులు అందాయి. రేటింగ్ ఏజెన్సీలు ICRA, CARE కూడా మోసపూరిత పత్రాలపై రుణాలు తీసుకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశాయి. ఈ కంపెనీ షేర్ ధర రూ. 20 నుంచి రూ. 1300కు పెరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక్కసారిగా పెట్టుబడిదారులకు నష్టాలు చూపించింది. పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కంపెనీల ఆర్థిక నివేదికలను విశ్లేషించడం, ప్రమోటర్ల వాటాలో మార్పులను గమనించడం, రెడ్ ఫ్లాగ్‌లను ముందే గుర్తించడం ద్వారా మోసాల నుండి తమను తాము కాపాడుకోవచ్చు.

ప్రమోటర్ల వాటా: ప్రమోటర్లు తమ వాటాను గణనీయంగా తగ్గించుకుంటే లేదా తాకట్టు పెడితే అది ఒక రెడ్ ఫ్లాగ్. కంపెనీ వృద్ధి చెందుతున్నప్పుడు ప్రమోటర్లు సాధారణంగా తమ వాటాలను పెంచుకుంటూపోతారు.

అకౌంటింగ్ హెచ్చుతగ్గులు: క్యాష్ ఫ్లో, ప్రాఫిట్స్, బ్యాలెన్స్ షీట్లలో తేడాలను గమనించాలి. అధిక క్యాష్ ఉన్నప్పటికీ రుణాలు చెల్లించలేకపోవడం లేదా వివరణ లేని ఖర్చులు కొంచెం అనుమానాన్ని కలిగిస్తాయి.

రేటింగ్ ఏజెన్సీ నివేదికలు: రేటింగ్ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్ చేసినప్పుడు లేదా మోసాలను సూచించినప్పుడు వాటిని సీరియస్‌గా తీసుకోవాలి.

ప్రమోటర్ల రెస్పాన్స్: ఆరోపణలు వచ్చినప్పుడు ప్రమోటర్లు వాటిని ఎలా ఎదుర్కొంటారో గమనించాలి. బలమైన కంపెనీలు తమపై వచ్చిన తప్పుడు ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటాయి.

అత్యంత వేగవంతమైన స్టాక్ వృద్ధి: మరీ వేగంగా పెరిగే స్టాక్ ధరలు కొన్నిసార్లు రియల్‌గా అనిపించవు. ప్రాథమిక ఆర్థిక అంశాలను విస్మరించి ఊహాగానాల ఆధారంగా పెట్టుబడులు పెట్టకూడదు.

Follow Us
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..