Jr.NTR: అభిమానితో కలిసి దేవర పాటకు ఎన్టీఆర్ డ్యాన్స్.. వీడియో అదిరిపోయింది..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మరోవైపు జపాన్ లో దేవర చిత్రాన్ని రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు తారక్.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన రాబోయే సినిమాలైన వార్ 2, డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు తారక్ నటించిన దేవర సినిమా పార్ట్ 1 జపాన్ లో విడుదల చేయనుంది చిత్రయూనిట్. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న జపాన్‌లోని థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మార్చి 22న తారక్ జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా జపాన్ దేవర సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న తారక్.. జపాన్ అభిమానులతో కలిసి దేవరలో సూపర్ హిట్ అయిన ఆయుధ పూజ పాటకు డ్యాన్స్ చేశారు.
తారక్ డ్యాన్స్ కు ముగ్దులైన జపాన్ ఫ్యాన్స్ చప్పట్లతో మరింత ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. గతంలో గతంలో, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం జపనీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక గత ఏడాది సెప్టెంబర్ 2024లో దేవర పార్ట్ 1 విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించింది. అలాగే, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు.
300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 421 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా రెండవ భాగానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. వార్ 2, డ్రాగన్ చిత్రాల తర్వాత దేవర పార్ట్ 2 స్టార్ట్ కానుంది.
#Devara fever grips Japan! 🌊🔥
Man of Masses #NTR stuns the Japanese audience as he grooves to Ayudha Pooja with a fan! 🤙🏻@tarak9999 #デーヴァラ #KoratalaSiva @anirudhofficial @devaramovie_jp pic.twitter.com/y9ybqaAYsT
— Devara (@DevaraMovie) March 24, 2025
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..