AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఇక అభిమానులకు పండగే..

దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కి్స్తోన్న ఈ సినిమాలో బీటౌన్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‏లో జాయిన్ అయ్యారు. తాజాగా ఈ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Jr.NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఇక అభిమానులకు పండగే..
Prashanth Neel, Jr Ntr
Rajitha Chanti
|

Updated on: Apr 29, 2025 | 3:39 PM

Share

దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతోపాటు అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా చేయనున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతుంది. కేజీఎఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ తోపాటు.. ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ చేయనున్నారనే విషయాన్ని సైతం ప్రకటించారు.

గతంలో ఈ సినిమాను 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టును 2026 జూన్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది మొహరం పండగ సందర్భంగా ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా అంటే మే 20న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ అప్డేట్ పై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా తెలియరాలేదు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. పీరియాడికల్ డ్రామాగా రాబోతుందని టాక్. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విధ్వంసమే సృష్టించడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. వచ్చే వేసవిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..