AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Varsha: ఇరుముడి క్రేజ్.. ‘మల్లెపూల పల్లకి’ పాటకు డ్యాన్స్‌ చేసిన జబర్దస్త్ వర్ష.. వీడియో ఇదిగో

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఇరుముడి' సినిమా ఫీవర్ నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని 'మల్లెపూల పల్లకి' సాంగ్ ఛార్ట్ బస్టర్ గా నిలిచింది.

Jabardasth Varsha: ఇరుముడి క్రేజ్.. 'మల్లెపూల పల్లకి' పాటకు డ్యాన్స్‌ చేసిన జబర్దస్త్ వర్ష.. వీడియో ఇదిగో
Jabardasth Varsha
Basha Shek
|

Updated on: Aug 28, 2026 | 7:00 PM

Share

మాస్ మహరాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. గత శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లుతోంది. థియేటర్లలో రిలీజై వారం రోజులు గడిచినా ఈ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. చాలా చోట్ల ఈ సినిమా కోసం ధర్నాలు, ఆందోళనలు జరుగుతుండడం ఇరుముడి సినిమా క్రేజ్ కు అద్దం పడుతోంది.ట్రేడ్ నిపుణులు సైతం రవితేజ సినిమా కలెక్షన్లను ఊహించలేకపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రూ. 150 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంద. ఇరుముడి జోరు చూస్తుంటే త్వరలోనే ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్ లో చేరవచ్చు. ఇక థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శిస్తున్నప్పుడు ఆడియెన్స్ బాగా ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా ‘మల్లెపూల పల్లకి’ పాట వచ్చినప్పుడు ప్రేక్షకులు థియేటర్లలో పూలు, హారతులు పడుతున్నారు. ఆధ్యాత్మిక భావనతో, భక్తి భావంతో డ్యాన్సులు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ మల్లెపూల పల్లకి సాంగ్ మార్మోగుతుంది. ఎక్కడ చూసినా ఇరుముడి పాట రీల్స్, డ్యాన్స్ వీడియోలే కనిపిస్తున్నాయి. సామాన్య జనాలే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ పాటకు కాలు కదుపుతున్నారు. తాజాగా జబర్దస్త్ నటి వర్ష కూడా ఇరుముడి సాంగ్ కు డ్యాన్స్ వేసింది. తన బృందంతో కలిసి ‘మల్లెపూల పల్లకి’ పాటకు స్టెప్పులేసింది.

అయ్యప్ప స్వాముల తరహాలో సంప్రదాయ దుస్తులు ధరించిన జబర్దస్త్ వర్ష తన బృందంతో కలిసి ఎంతో ఎనర్జిటిక్ గా ఇరుముడి పాటకు స్టెప్పులేసింది. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఇక ఇరుముడి సినిమా విషయానికి వస్తే.. శివ నిర్వాణ ఈ డివోషనల్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే బేబీ నక్షత్ర, సాయికుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

ఇరుముడి మల్లెపూల పల్లకి సాంగ్.. లిరికల్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us