గోదావరి తీరంలో వేలాది వలస పక్షుల సందడి.. నత్తకొంగలకు సురక్షిత నిలయంగా మారిన మధ్యలంక!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బి.దొడ్డవరం మధ్యలంకకు వేలాది ఏషియన్ ఓపెన్‌బిల్ స్టార్క్‌లు వలస వచ్చాయి. తుమ్మ చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తి చేస్తున్న ఈ పక్షులను స్థానికులు నత్తకొంగలుగా పిలుస్తున్నారు. గోదావరిలో లభించే నత్తలు వీటి ప్రధాన ఆహారం. తుమ్మ చెట్ల ముళ్లు పాముల నుంచి పిల్లలను రక్షించడంతో ఈ చెట్లనే ఆవాసంగా ఎంచుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. వేట నుంచి వీటిని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
