AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream Meaning: ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!

Aspicious Deams Telugu: స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలను శుభ సంకేతాలుగా భావిస్తారు. స్వచ్ఛమైన నీరు, సూర్యోదయం, దేవాలయం, పచ్చని ప్రకృతి, బంగారం వంటి 7 కలలు జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సానుకూల మార్పులకు సూచనగా చెబుతారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Dream Meaning: ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!
Aspicious Deams Telugu
Rajashekher G
|

Updated on: Sep 16, 2026 | 10:25 PM

Share

Aspicious Deams Telugu: ప్న ప్రపంచం ఎన్నో రహస్యాలు, సంకేతాలతో నిండి ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. మనకు వచ్చే ప్రతి కలకు ఏదో ఒక అర్థం ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా జీవితంలో కష్టాలు, ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో కనిపించే కొన్ని కలలు.. రాబోయే మార్పులకు సంకేతాలుగా భావిస్తారు. స్వప్న శాస్త్ర విశ్వాసాల ప్రకారం, కొన్ని రకాల కలలు భవిష్యత్తులో ఆనందం, శ్రేయస్సు, సౌభాగ్యం వంటి సానుకూల పరిణామాలను సూచిస్తాయని చెబుతారు. అలాంటి ఏడు కలలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్వచ్ఛమైన నీరు లేదా జలపాతం కనిపించడం

కలలో స్వచ్ఛమైన నీరు, జలపాతం లేదా ప్రవహించే నదిని చూడటం సానుకూల సంకేతంగా భావిస్తారు. ఇది కొత్త ప్రారంభాలు, మానసిక ప్రశాంతతకు ప్రతీకగా చెబుతారు. గతంలో ఎదురైన ఒత్తిళ్లు, ప్రతికూల పరిస్థితుల నుంచి క్రమంగా ఉపశమనం లభించే సూచనగా కూడా పరిగణిస్తారు. జీవితం మరింత స్థిరంగా మారే అవకాశం ఉందని స్వప్న శాస్త్ర విశ్వాసం.

2. సూర్యోదయం కనిపించడం

కలలో సూర్యోదయాన్ని చూడటం కొత్త ఆశలు, అవకాశాలకు ప్రతీకగా భావిస్తారు. చీకటి తర్వాత వెలుగు రావడం.. కష్టాల తర్వాత మంచి రోజులు ప్రారంభమయ్యే సంకేతంగా చెబుతారు. వృత్తి, వ్యక్తిగత జీవితం వంటి రంగాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకోవచ్చని నమ్మకం. కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరగడానికీ ఇది సూచనగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

3. దేవాలయం లేదా దేవతలు కనిపించడం

కలలో దేవాలయం, ప్రార్థనా స్థలం లేదా దేవతా విగ్రహం కనిపించడం ఆధ్యాత్మికంగా శుభ సంకేతంగా భావిస్తారు. కష్టకాలంలో దైవిక మద్దతు లభిస్తుందని, మానసిక బలం పెరుగుతుందని నమ్ముతారు. భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసం మరింత బలపడటానికి ఇది సూచనగా చెబుతారు.

4. ఆకాశంలో ఎగురుతున్నట్లు కల రావడం

తాను ఆకాశంలో ఎగురుతున్నట్లు కల కనడం స్వేచ్ఛ, విముక్తికి ప్రతీకగా భావిస్తారు. చాలాకాలంగా ఎదుర్కొంటున్న పరిమితులు లేదా సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు ఏర్పడవచ్చని స్వప్న శాస్త్ర విశ్వాసం. లక్ష్యాల వైపు ముందుకు సాగడం, విజయాన్ని అందుకోవడం వంటి సానుకూల పరిణామాలకు ఇది సంకేతంగా చెబుతారు.

5. తెల్లని దుస్తులు లేదా ప్రకాశవంతమైన కాంతి కనిపించడం

కలలో తెల్లని దుస్తులు ధరించడం లేదా ప్రకాశవంతమైన కాంతిని చూడటం శాంతి, స్వచ్ఛత, సానుకూలతకు ప్రతీకగా భావిస్తారు. జీవితంలో స్థిరత్వం ఏర్పడటం, గౌరవం పెరగడం, మానసిక ప్రశాంతత లభించడం వంటి పరిణామాలకు ఇది సంకేతమని నమ్ముతారు. ఇంటి, ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని కూడా చెబుతారు.

6. పచ్చని ప్రకృతి, పూలు లేదా పంటలు కనిపించడం

కలలో పచ్చని తోటలు, వికసిస్తున్న పూలు లేదా పచ్చని పంటలు కనిపించడం సౌభాగ్యం, అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, ఇంట్లో సౌకర్యాలు పెరగడం, చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రయోజనాలు అందడం వంటి పరిణామాలకు ఇది సూచనగా చెబుతారు. వ్యాపారం, పెట్టుబడులు వంటి విషయాల్లోనూ సానుకూల ఫలితాలకు ప్రతీకగా కొందరు భావిస్తారు.

7. బంగారం లేదా విలువైన ఆభరణాలు కనిపించడం

కలలో బంగారం లేదా విలువైన ఆభరణాలు కనిపించడం సంపద, ఆర్థికాభివృద్ధికి సంకేతంగా స్వప్న శాస్త్రంలో భావిస్తారు. కొందరి విశ్వాసాల ప్రకారం ఇది లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీక. ఆర్థిక ఇబ్బందులు తగ్గడం, కొత్త ఆదాయ అవకాశాలు రావడం లేదా సంపద పెరగడం వంటి పరిణామాలకు ఇది సూచనగా చెబుతారు.

(Disclaimer: స్వప్న శాస్త్రంలో చెప్పే ఈ అర్థాలు సంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. కలలకు శాస్త్రీయంగా నిర్ధారితమైన భవిష్యత్ సూచనలుగా వీటిని పరిగణించకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..