బిగ్‌బాస్ 10లోకి సీరియల్ బ్యూటీ.. ఆ హీరోతోపాటు ఈ ముద్దుగుమ్మ సైతం..
Rajitha Chanti
Pic credit - Instagram
27 August 2026
తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌బాస్' పదవ సీజన్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే నాగార్జున హోస్ట్‌గా రానున్న ఈ షోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కొత్త సీజన్‌ను మరింత వినూత్నంగా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తుండగా, సోషల్ మీడియాలో కంటెస్టెంట్లకు సంబంధించిన రకరకాల పేర్లు వైరల్ అవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ సీరియల్ నటి రక్షా గౌడ (Raksha Gowda) ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది.
తెలుగులో ఘనవిజయం సాధించిన 'గుప్పెడంత మనసు' సీరియల్‌తో వసుధార పాత్రలో రక్షా గౌడ ఇంటింటికీ పరిచయమయ్యారు. తనదైన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించింది.
తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ కన్నడ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ, యూత్‌లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
సీరియల్ ముగిసిన తర్వాత కొంతకాలం బుల్లితెరకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు నేరుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుండటం ఆమె అభిమానులకు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
సీరియళ్లలో ఎంతో పద్ధతిగా, ప్రశాంతంగా కనిపించే రక్షా గౌడ.. టాస్క్‌లు, మైండ్ గేమ్‌లు, వివాదాలతో సాగే బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా రాణిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఆమె రాకతో షోలో ఎంటర్‌టైన్‌మెంట్ మరింత పెరుగుతుందని, ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నట్లు టెలివిజన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఎలా ఉంటుందో చూడాలి.