బాబోయ్.. ఏం అందం గురూ..

Samatha

28 August 2026

అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఈ బ్యూటీ తన గ్లామర్‌తో కుర్రకారును మాయ చేసిందనే చెప్పాలి. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.

రెబల్ స్టార్ ప్రభాస్,  ది రాజాసాబ్ మూవీతో తెలుగు అభిమానులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మాళవిక మోహన్.

ఇక ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిన్నది  ప్రభాస్ సరసన ది రాజాసాబ్ సినిమాలో, భైరవి పాత్రలో నటించి మెప్పించింది.

మలయాళి బ్యూటీ అయిన ఈ చిన్నది, తమిళంలో మాస్టర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది.  అంతే కాకుండా తన నటన, అందం, గ్లామర్‌తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.

ఇక మలయాళం, తమిళంలో పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న ఈ చిన్నది తెలుగులో కూడా రాజా సాబ్ మూవీతో ఫుల్ బిజీ అవుతాను అనుకుంది. కానీ అలా జరగలేదు.

సినిమా అంతగా హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు అనే చెప్పాలి.  సినిమాల విషయం పక్కన పెడితే..

ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది. రీసెంట్‌గా ఓనం పండుగ జరుపుకున్న ఫొటోలు షేర్ చేసింది.