AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Rules: రాఖీ సందర్భంగా అక్క లేదా చెల్లికి బహుమతులు, డబ్బులు ఇస్తున్నారా.? జాగ్రత్త.. ఈ తప్పు చేస్తే జరిమానా

రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమకు ప్రతీక. తమకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడతారు. స్వీట్లు తినిపించి చేతికి రాఖీ కడతారు. ఈ సందర్భంగా తమ సోదరీమణులకు సోదరులు గిఫ్ట్‌లు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు.

Income Tax Rules: రాఖీ సందర్భంగా అక్క లేదా చెల్లికి బహుమతులు, డబ్బులు ఇస్తున్నారా.? జాగ్రత్త.. ఈ తప్పు చేస్తే జరిమానా
Rakhi
Venkatrao Lella
|

Updated on: Aug 28, 2026 | 6:30 PM

Share

రక్షాబంధన్ అనగానే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పండుగగా చెప్పవచ్చు. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టడంతో పాటు స్వీట్లు తినిపించి ఈ పండుగ జరుపుకుంటారు. రాఖీ కట్టిన సందర్భంగా అక్క లేదా చెల్లెలికి తమ సోదరులు గిఫ్ట్‌లు ఇవ్వడం లేదా నగదు రూపంలో బహుమతి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది సోదరులు తమ సోదరిపై ప్రేమతో అత్యంత ఖరీదైన బహుమతులు కూడా అందిస్తూ ఉంటారు. అయితే రక్షాబంధన్ సందర్భంగా ఇలా బహుమతుల రూపంలో ఇచ్చే నగదు, గిఫ్ట్స్‌పై పన్ను ఉంటుందా? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. చాలామందికి తెలియని ట్యాక్స్ నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.50 వేలకు మించి ఇస్తే..

రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల నుంచి అనేక బహుమతులు అందుకుంటూ ఉంటారు. నగదు రూపంలో, బంగారు ఆభరణాలు, ఆస్తి రూపంలో గిఫ్ట్‌లు వస్తూ ఉంటూ ఉంటాయి. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం సొంత బంధువు నుంచి వచ్చే బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు. సోదరి, సోదరుడు తోబుట్టువులు, బంధువులు అయితే గనుక ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పనే లేదు. అయితే బంధువు కాని వ్యక్తి నుంచి బహుమతులు స్వీకరిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బంధువు కాని వ్యక్తి నుంచి ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.50 వేలకు మించి బహుమతుల రూపంలో స్వీకరిస్తే.. పన్ను పరిధిలోకి వస్తారు. ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధించాల్సి ఉంటుంది. వీటిని ఇతరుల నుంచి వచ్చన ఆదాయంగా పరిగణించి ట్యాక్స్ విధిస్తారు.

క్యాష్ రూపంలో ఇస్తున్నారా..?

నిర్ధిష్టమైన బంధువు నుంచి బహుమతులు స్వీకరిస్తే పన్ను పరిధిలోకి రావు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(x) బహుమతులపై విధించే పన్నును నియంత్రిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం సోదరుడు తన సోదరీమణికి బహుమతి రూపంలో నగదు ఇచ్చినా, బంగారు ఆభరణాలు ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా ఎలాంటి పన్ను ఉండదు. అయితే కజిన్ నుంచి స్వీకరిస్తే మాత్రం పన్ను ఉంటుంది. ఒక ఏడాదిలో కజిన్ లేదా స్నేహితుల నుంచి రూ.51 వేలకు మంచి అందుకుంటే పన్ను ఉంటుంది. అయితే వివాహం సందర్భంగా బంధువులు లేదా స్నేహితుల నుంచి అందుకునే బహుమతులపై పన్ను ఉండదు. స్నేహితులు, కజిన్, బంధువుకాని వ్యక్తల నుంచి రాఖీ, దీపావళి, పుట్టిన రోజు సందర్భంగా అందుకునే బహుమతులపై పన్ను ఉంటుంది.  అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం..  ఒకే రోజులో లేదా ఒకే లావాదేవీలో ఒకే వ్యక్తి నుండి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును వేరే వ్యక్తి స్వీకరించకూడదు.  ఒకవేళ రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు క్యాష్ రూపంలో ఇస్తే జరిమానా పడవచ్చు. దీంతో సోదరుడు బహుమతి రూపంలో తన సోదరికి రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు ఇస్తుంటే.. చెక్, NEFT, లేదా UPI ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయడం మంచిది.

Follow Us
నల్ల చారలతో తెల్లటి పులి.. ఈ అరుదైన రూపం వెనుక కారణమేంటి?
నల్ల చారలతో తెల్లటి పులి.. ఈ అరుదైన రూపం వెనుక కారణమేంటి?
వినాయక చవితి స్పెషల్.. 6 వ రోజు గణేశుడి నైవేద్యంగా బెల్లం జిలేబి
వినాయక చవితి స్పెషల్.. 6 వ రోజు గణేశుడి నైవేద్యంగా బెల్లం జిలేబి
భారత్ - అఫ్గన్ మ్యాచ్‎ను టార్గెట్ చేసిన బ్లాక్ మాఫియా
భారత్ - అఫ్గన్ మ్యాచ్‎ను టార్గెట్ చేసిన బ్లాక్ మాఫియా
BSNL బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ..!
BSNL బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ..!
నిమజ్జనానికి ముందు బప్పా చెవిలో ఈ మాట చెప్పండి.. మీ కోరిక..
నిమజ్జనానికి ముందు బప్పా చెవిలో ఈ మాట చెప్పండి.. మీ కోరిక..
మెగాస్టార్‌కు పడాల్సిన బ్లాక్ బస్టర్.. కానీ మిస్ అయ్యి
మెగాస్టార్‌కు పడాల్సిన బ్లాక్ బస్టర్.. కానీ మిస్ అయ్యి
అద్దె ఇంట్లో వాస్తు దోషం ఉందా? సింపుల్ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ
అద్దె ఇంట్లో వాస్తు దోషం ఉందా? సింపుల్ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ
నిటారుగా ఉన్న కొండలను సైతం అవలీలగా ఎక్కుతుంది
నిటారుగా ఉన్న కొండలను సైతం అవలీలగా ఎక్కుతుంది
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్
ఫేస్ బుక్ లవర్ కోసం శ్రీలంక వెళ్లిన 17 ఏళ్ల కుర్రాడు అరెస్ట్
ఫేస్ బుక్ లవర్ కోసం శ్రీలంక వెళ్లిన 17 ఏళ్ల కుర్రాడు అరెస్ట్