ఈ సినిమా చేసి తప్పు చేశా.. నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం ఇదే : నయనతార
స్టార్ హీరోయిన్లలో నయనతార ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోలకు మించి స్టార్ డమ్ సంపాదించుకుంది. నయన్ తాజాగా యష్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమాలో నటించింది నయనతార

సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న అందాలభామల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్‌తో పాటు క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న రోల్స్, సెకండ్ హీరోయిన్ గా చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నయన్. ఆతర్వాత హీరోయిన్ గా మారి హిట్స్ మీద హిట్స్ అందుకుంది. తాజాగా కన్నడ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో టాక్సిక్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే నయనతార గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు.. నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు
ఓ హీరో సినిమాలో నటించి తప్పు చేశానని నయన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది నయన్. కానీ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. గతంలో ఆమె ప్రేమ వ్యవహారాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఓఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా జీవితంలో నేను ఓ సినిమాకు ఒకే చేసి తప్పు చేశా అని సంచలన కామెంట్స్ చేసింది నయనతార. ఇంతకూ నయన్ చెప్పింది ఏ సినిమా గురించో తెలుసా.?
మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు
అయితే తాను చేసిన సినిమాల్లో, తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత చెత్త డెసిషన్ గజినీ సినిమా చేయడమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2005లో ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన గజినీ చిత్రంలో సూర్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆసిన్ ప్రధాన కథానాయికగా నటించగా.. నయన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ సినిమాలో తనను చెడుగా చూపించారని.. హీరోయిన్ పాత్రకు దగ్గరగా ఉందని చెప్పి.. అలా చూపించలేదని అన్నారు. అది తనను ఎంతో బాధించిందని.. ఆసినిమా చేసి తప్పు చేశానని గతంలో చెప్పుకొచ్చింది. ఈ కిలేమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
చిరంజీవి ఇష్టమైన బాలయ్య సినిమా ఎదో తెలుసా.? ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ అది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




