AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిన 5 రకాల చేపలు!

చేపలంటే ఇష్టపడేవారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నో రకాల చేపలు అందుబాటులో ఉంటాయి. సముద్ర చేపలతో పాటు చెరువులు, నదులు, రిజర్వాయర్లలో పెరిగే మంచినీటి చేపలకు కూడా మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో చేపల వినియోగంపై జరిగిన ఒక అధ్యయనంలో రోహు, కట్లా, ముర్రెల్ చేపలు వినియోగదారుల ప్రాధాన్యంలో టాప్‌లో ఉంటాయి. అయితే జీవితంలో ఒక్కసారైనా కచ్చితంగా టేస్ట్ చేయాల్సిన ఓ ఐదు రకాల చేపల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Phani CH
|

Updated on: Aug 28, 2026 | 4:22 PM

Share
కొర్రమీను (ముర్రెల్).. తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉన్న చేపల్లో కొర్రమీను ముందుంటుంది. ముర్రెల్‌ను తెలంగాణ రాష్ట్ర చేపగా కూడా పేర్కొంటారు. ఈ చేప మాంసం మెత్తగా, ప్రత్యేకమైన రుచితో పాటు ముళ్లు తక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. అందుకే ఫ్రై, కర్రీ రెండింటికీ ఇది మంచి ఎంపిక.

1 / 5
రోహు చేప.. రోహు చేపను ఏపీ, తెలంగాణలో విస్తృతంగా తింటారు. కర్రీ, ఫ్రై, పులుసు వంటి వంటకాల్లో రోహు రుచి బాగా ఉంటుంది. హైదరాబాద్‌లో చేపల వినియోగదారుల అధ్యయనంలో రోహు మొదటి స్థానంలో నిలవడం దీని ప్రజాదరణకు నిదర్శనం.

2 / 5
కట్లా చేప.. కట్లా లేదా బొచ్చ చేప పెద్ద ముక్కలుగా లభించడం, కర్రీలో మంచి రుచి రావడం వల్ల చాలామందికి ఇష్టమైన చేప. తెలంగాణలో కూడా కట్లా, రోహు వంటి చేపలు సాధారణంగా లభిస్తాయి.

3 / 5
వంజరం/కొనేమ (సీర్ ఫిష్).. సముద్ర చేపల్లో వంజరం లేదా కొనేమకు ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఇది ముఖ్యమైన వాణిజ్య చేపగా లభిస్తుంది. ముక్కలు పెద్దగా ఉండటం, ఫ్రై చేసినప్పుడు మంచి రుచి రావడంతో చేపల ప్రియులు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు.

4 / 5
పండుగప్ప (సీబాస్).. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాల్లో లభించే మరో రుచికరమైన చేప పండుగప్ప. సీబాస్‌గా పిలిచే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఫ్రై, గ్రిల్, కర్రీ వంటి వంటకాలకు ఉపయోగించవచ్చు.

5 / 5
Follow Us
దీపావళి రోజు తలంటు స్నానం ఎందుకు చేస్తారు? లక్ష్మీదేవి, గంగాదేవి

దూసుకొస్తున్న మురసు తుఫాన్..
దూసుకొస్తున్న మురసు తుఫాన్..
తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత ఖర్చవుతుంది? తరుగు, ఛార్జీలు ఎంత?

టీమిండియాను గౌతమ్ గంభీర్ వదిలేస్తున్నారా?

71 వేల మందికి ప్రభుత్వ గిఫ్ట్.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన

జర్మనీలో భగ్గుమన్న జెన్-జీ.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ!

సమతామూర్తి వద్ద 'ఈక్వాలిటీ రన్'.. చిన్న జీయర్ స్వామి గ్రాండ్ రన్

భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు

దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..

రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?