మరోసారి ఆశలు గల్లంతు.. కియారాకు సౌత్ కలిసి రావట్లేదా.. ?
Rajitha Chanti
Pic credit - Instagram
28 August 2026
బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఉత్తరాదిన వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. అయితే ఈ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీని కలిసి రావట్లేదనే చెప్పాలి.
హిందీలో సాధిస్తున్న స్థాయిలో ఆమెకు సౌత్ చిత్రసీమలో ఆశించిన విజయాలు దక్కడం లేదనే చర్చ ఫిలిం సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. తాజాగా మరో ప్లాప్ అందుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' చిత్రంతో కియారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిటైంది.
దీంతో ఆమెకు తెలుగులో గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామా' చిత్రంలో నటించినా.. ప్లాప్ వచ్చింది చేరింది.
ఇక భారీ అంచనాల నడుమ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన గ్లోబల్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్' లోనూ కియారా కథానాయికగా నటించగా మెప్పించలేదు.
ఇప్పుడు టాక్సిక్ సినిమా సైతం నిరాశపరిచింది. సౌత్ సినిమాల్లో ఆమె ఎంచుకునే పాత్రలు కేవలం గ్లామర్ కోషెంట్, పాటలకే పరిమితమవుతున్నాయనే అభిప్రాయం ఉంది.
బాలీవుడ్‌లో 'కబీర్ సింగ్', 'షేర్షా' వంటి చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసిన ఆమె, సౌత్‌లో మాత్రం భారీ బడ్జెట్ , కమర్షియల్ హంగులకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
మాస్, యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌కు పెద్దగా స్కోప్ ఉండకపోవడం కూడా ఆమెకు ప్రతికూలంగా మారుతోందనే నెట్టింట టాక్ నడుస్తుంది.