AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సూసైడ్ లాంటి మర్డర్.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.2 రేటింగ్

క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. కంటెంట్ పరంగా, మేకింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు చాలా ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: సూసైడ్ లాంటి మర్డర్.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.2 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 28, 2026 | 6:16 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ తదితర భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటిలో ఒక తెలుగు సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. మరీ సూపర్ హిట్ కాకపోయినా సినిమా బాగుందన్న మాటలు వినిపించాయి. ముఖ్యంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఆడియెన్స్ ను ఆకట్టుకునే అంశాలు, ట్విస్టులు చాలానే ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు 9.2 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 1999లో జరిగిన ఓ డబుల్ మర్డర్‌తో ఈ సినిమా స్టోరీ మొదలవుతుంది. ఒకే ఘటనలో ఇద్దరు హత్యకు గురవుతారు. ఆ హత్యలు ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా ? అనే ప్రశ్నలకు అప్పట్లోనే సమాధానాలు దొరకవు. కాలం గడిచేకొద్దీ ఆ కేసు కూడా దాదాపుగా మరుగున పడిపోతుంది. అయితే 27 ఏళ్ల తర్వాత ఈ పాత హత్యలకు సంబంధించిన ఓ పుస్తకం వెలుగులోకి వస్తుంది. దీంతో ఈ పాత హత్యల మిస్టరీ మళ్లీ తెర మీదకు వస్తుంది. అసలు ఆ పుస్తకం ఎవరు రాశారు? 1999లో జరిగిన హత్యలకు సంబంధించిన విషయాలకు ఆ పుస్తకానికి సంబంధమేంటి? ఆ పాత హత్యల వెనుక ఉన్న అసలు నేరస్థుడు ఎవరు ? ఇన్నేళ్లుగా ఈ నిజాలను ఎవరు, ఎందుకు దాచారు? చివరకు ఏం తేలింద అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో ఆకట్టుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ తెరకెక్కించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ లోఅక్కినేని సుమంత్ హీరోగా నటించాడు. అలాగే జగపతి బాబు, శ్రీనివాస అవసరాల, రవివర్మ, త్రినాథ్ వర్మ, నేహా పఠాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు 2 గంటల 18 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమాలో మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, రివెంజ్, సీక్రెట్స్.. ఇలా థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇష్టపడేవారికి ‘న్యూటన్స్ థర్డ్ లా’ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో అక్కినేని సుమంత్ క్రైమ్ థ్రిల్లర్..

అక్కినేని సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us