Ajith :ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. 25ఏళ్ల తర్వాత అజిత్ సినిమాలో ఆ హాట్ బ్యూటీ
అమరావతి సినిమాతో తమిళంలో హీరోగా పరిచయం అయ్యాడు నటుడు అజిత్. దర్శకుడు సెల్వ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత ఆసి, కాదల్ కొట్టి, కాదల్ మన్నన్, అహ వరువాలా, వాలి వంటి హిట్ చిత్రాలలో నటించి స్టార్ స్టేటస్ అందుకున్నాడు.

తమిళ్ స్టార్ హీరో అజిత్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక తమిళనాట ఆయన క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. అజిత్ రీసెంట్ గ విదాముయార్చి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను పట్టుదల అనే టైటిల్ తో తెలుగులోనూ విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ అజిత్ ఫ్యాన్స్ కు మాత్రం కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.
ఇది కూడా చదవండి : ఇదేందయ్యా ఇది..! ఎలా ఉన్న హీరోయిన్ ఎలా మారిపోయింది..!! అస్సలు గుర్తుపట్టలేదు గురూ..!
ఈ సినిమా పై అజిత్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అజిత్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అజిత్ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. దాదాపు 25ఏళ్ల తర్వాత అజిత్ సినిమాలో ఆమె నటించడం విశేషం ఆమె ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయింది.. ప్లాట్ ఫామ్ మీద నిద్రపోయింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది ముద్దుగుమ్మ సిమ్రాన్. అప్పట్లో ఎక్కడ చూసిన ఆమె కనిపించేది. తెలుగు, తమిళ్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు సిమ్రాన్. ప్రస్తుతం ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అడపాదడపా సినిమాలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు అజిత్ సినిమాలో సిమ్రాన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారని టాక్. అప్పటిలో అజిత్, సిమ్రాన్ కాంబో ఓ సెన్సేషన్. వాలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు 25ఏళ్ల తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్, సిమ్రాన్ కలిసి కనిపించనున్నారని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి :25 సినిమాలు చేస్తే అందులో 5 హిట్లు.. కట్ చేస్తే నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







