AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటరిగా చూడాల్సిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న రొమాంటిక్ మూవీ

ఓటీటీల జోరు కొనసాగుతోంది. సూపర్ హిట్ సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సినిమాలను థియేటర్స్‌లో చూస్తూ.. అలాగే రిలీజ్ అయిపోయిన సినిమాలను ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. ఇక హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ మూవీస్‌కు మంచి క్రేజ్ ఉంది.

ఒంటరిగా చూడాల్సిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న రొమాంటిక్ మూవీ
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2025 | 12:12 PM

Share

ప్రతి శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

ఇక ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాల్లో థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ట్రెండింగ్‌లో ఉంది ఆ సినిమా.. ఇంతకూ ఆ సినిమా కథ ఏంటంటే..ఇది ఓ మలయాళ సినిమా.. ఇటీవలే ఓటీటీలో ఎక్కువుగా ఆకట్టుకున్న సినిమాల్లో మలయాళ సినిమాలే ఎక్కువ. ఇది కూడా మలయాళ సినిమానే.. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..

ఈ మూవీలో ఓ యువతీ బాగా డబ్బున్న ముసలోడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే అతను ఆమెకు ఇష్టంలేకున్నా కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. అలాగే ఆమెను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు.. రోజూ కొడుతూ.. టార్చర్ చేస్తుంటాడు. అయితే అతని ఇంటికి వచ్చిన ఓ లాయర్ ఆమె పై కన్నేస్తాడు. కోరికలు తీర్చమని ఆమెను బలవంతపెడతాడు. ఆ తర్వాత ఓ రోజు ఆ యువతి ప్లాన్ చేసి తన భర్తను ఓ కొండమీద నుంచి తోసేస్తుంది. దాంతో అతను మంచానికే పరిమితం అవుతాడు. అయితే ఆ ముసలోడ్ని చూసుకోవడానికి ఓ మేల్ నర్స్ వస్తాడు. ఆ తర్వాత ఆమెకు ఆ మేల్ నర్స్‌కు మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పాడుతుంది. అయితే ఆమె మరోసారి తన ముసలి భర్తను చంపాలని అనుకుంటుంది. దానికి ఆ మేల్ నర్స్ సాయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది.? ఆ ఇద్దరూ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనేది మిగిలిన కథ. ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతం ఆకట్టుకుంటుంది. ఓటీటీలోనూ ఈ సినిమా తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పేరు చతురం. ఈ సినిమాను మీరు సైనాప్లేలో చూడొచ్చు. ఈ సినిమాను ఒంటరిగా చూడటం బెటర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే