AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాయమ్మో..! రాజమౌళితో స్టార్ యాంకర్ రొమాంటిక్ వీడియో.. ఇదెప్పుడు జరిగింది అంటున్న నెటిజన్స్

దర్శక ధీరుడి రాజమౌళి డైరెక్షన్‌లో చేయాలనీ ఎవరికీ మాత్రం ఉండదు. చిన్న పాత్ర అయినా సరే అవకాశం వస్తే చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అపజయం అంటూ లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా హిట్, ఇప్పుడు గ్లోబల్ రేంజ్ హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ రాణిస్తున్నారు.

వాయమ్మో..! రాజమౌళితో స్టార్ యాంకర్ రొమాంటిక్ వీడియో.. ఇదెప్పుడు జరిగింది అంటున్న నెటిజన్స్
Rajamouli
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2025 | 8:30 AM

Share

దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఇండస్ట్రీలో అపజయం అన్నది లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి లాంటి సినిమాతో ఇండియా మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు రాజమౌళి. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఏకంగా 18వందల కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జక్కన్న. ఈ సినిమాతో ఏకంగా ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు. అంతే కాదు హాలీవుడ్ దిగ్గజ దర్శకులు కూడా రాజమౌళిని మెచ్చుకున్నారు. అంతే కాదు తెలుగు సినిమాను ఆస్కార్ వేదిక పై నిలబెట్టాడు.

ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్  బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఇదిలా ఉంటే రాజమౌళికి సంబంధించిన ఓ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇదెప్పుడు జరిగింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే.. రాజమోళి యాంకర్ రష్మీ తో కలిసి కనిపించారు. ఈ ఫన్నీ వీడియోలో రాజమౌళి రష్మీకి సైట్ వేయడం.. ఆమె రాజమౌళికి పడిపోవడం మనం చూడొచ్చు.

ఈ ఫన్నీ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో విక్రమార్కుడు సినిమా సమయంలోది అని తెలుస్తుంది. అప్పట్లో యువ అనే సీరియల్ వచ్చేది అందులో రష్మీ ప్రధాన పాత్రలో నటించింది. ఆ సీరియల్లో ఓ సన్నివేశంలో ఇలా రాజమౌళి గెస్ట్ లా కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే మహేష్ బాబుతో జక్కన్న చేయబోతున్న సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ అందించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి