Coolie: రజినీకాంత్‌తో స్టెప్పులేయనున్న టాలీవుడ్ హీరోయిన్.. కూలీ సినిమాలో ఆ బ్యూటీ
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’, వేట్టయన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత.. సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నారు. తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో ఈ డైరెక్టర్ అదరగొడుతున్నాడు. ఇక ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ సినిమా అక్టోబర్ 10న విడుదలైంది. దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా నిర్మించింది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన మలయాళ నటి మంజు వారియర్ నటించింది. క్రైమ్ అండ్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, చౌవిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలు పెంచేసింది.
ఈ సినిమా మొదటి దశ షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ఈ సినిమా తదుపరి దశ షూటింగ్ జరుపుకుంటుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో మరో ముద్దుగుమ్మ కూడా చేరిందని తెలుస్తోంది. ఓ స్టార్ హీరోయిన్ కూలి సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే. కూలి సినిమాలో పూజాహెగ్డే . కూలి సినిమాలో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయనుందని తెలుస్తుంది.
స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న పూజా హెగ్డే గతంలోను స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు సూపర్ స్టార్ తో డాన్స్ చేయనుందని తెలుస్తుంది. గతకొంత కాలంగా పూజకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది.ఈ అమ్మడు చేసిన సినిమాల్ని ప్రేక్షకులను నిరాశపరిచాయి. రీసెంట్ గా చేసిన దేవ్ సినిమా కూడా బోల్తా కొట్టింది. దాంతో సూపర్ స్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు ఒప్పుకుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై ఓ క్లారిటీ రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




