Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది..! ఎలా ఉన్న హీరోయిన్ ఎలా మారిపోయింది..!! అస్సలు గుర్తుపట్టలేదు గురూ..!

పై ఫొటోలో ఉన్న ఉన్నదెవరో గుర్తుపట్టారా? ఈమె ప్రముఖ కోలీవుడ్‌ హీరోయిన్‌. తమిళంలో సినిమాలు చేసినా తెలుగు ఆడియెన్స్‌కు కూడా సుపరిచితమే. చేసింది రెండు సినిమాలైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు.. ఈ అందాల తార తల్లి, అక్క కూడా హీరోయిన్లే. ముఖ్యంగా తల్లి 90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది.

ఇదేందయ్యా ఇది..! ఎలా ఉన్న హీరోయిన్ ఎలా మారిపోయింది..!! అస్సలు గుర్తుపట్టలేదు గురూ..!
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 19, 2025 | 12:34 PM

చాలా మంది హీరోయిన్స్ సినిమాలకు దూరం అయిన తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉంటారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే.. చేసింది తక్కువ సినిమాలే అయిన.. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది ఆమె. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆ అమ్మడు. ఆమె చేసింది రెండు రెండు సినిమాలు అవి కూడా తమిళ్‌లో కానీ ఆ సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా ఫెవరెట్ హీరోయిన్ గా మారింది. అన్నట్లు.. ఈ అందాల తార తల్లి, అక్క కూడా హీరోయిన్లే. ముఖ్యంగా తల్లి 90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా ఏలింది. మెగాస్టార్‌ చిరంజీవికి పోటీగా డ్యాన్స్‌ చేసి అభిమానుల ప్రశంసలు అందుకుంది.

ఇక సోదరి విషయానికొస్తే.. పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది. ఇదే బ్యాగ్రౌండ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. కానీ రెండు సినిమాలకే పరిమితం అయ్యింది. హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయినా ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు అలనాటి అందాల తార రాధ రెండో కూతురు తులసి నాయర్‌.

రాధ మొదటి కూతురు కార్తీక కూడా హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. జీవ హీరోగా నటించిన రంగం సినిమాతో పాపులర్ అయ్యింది. అంతకు ముందు నాగ చైతన్య డెబ్యూ మూవీ జోష్ లో నటించింది కార్తీక. ఇక తులసి నాయర్‌ విషయానికొస్తే స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన కడలి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత 2014లో యాన్‌ అనే మరో తమిళ సినిమాలో కథానాయికగా మెరిసింది. దీనినే రంగం 2 పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాల తర్వాత ఇండస్ట్రీలో కనిపించలేదు ఈ అమ్మడు. మొన్నామధ్య అక్క కార్తీక పెళ్ళిలో కనిపించింది.  ఇలా బొద్దుగా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది తులసి. ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు.

Thulasi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.