సునామీ అలర్ట్! జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!
ప్రకృతి వైపరీత్యాలు ఆ దేశంపై విరుచుకుపడటం చూస్తాం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లాంటి ప్రమాదకర ప్రాంతంలో ఉన్నందున జపాన్‌కు అన్ని వేళలా ప్రమాదం పొంచి ఉంది. తాజాగా జపాన్ దేశాన్ని భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనల ధాటికి అక్కడి ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో భవనాలు ఊగిపోయాయి, వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.
40 నిమిషాల తర్వాత ఇవాటె పోర్ట్‌ను సునామీ తాకింది. తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసారు. సముద్ర అలలు భారీ ఎత్తున ఎగిసిపడే ప్రమాదం ఉన్నందున తక్షణమే తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని యంత్రాంగం ఆదేశించింది. పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువ కావడం ప్రజలను భయపెట్టింది. భూకంప కేంద్రం సముద్ర గర్భంలో ఉండటం వల్ల ముప్పు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపడుతూ జపాన్ ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. భూకంప కేంద్రం నుంచి ప్రకంపనలు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విస్తరించాయి. టోక్యోలోని ఎత్తైన కట్టడాలు ఆ ధాటికి కదిలిపోయాయి. రైలు విమాన సర్వీసుల్ని నిలిపేసారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో వేలాది ఇళ్లు అంధకారంలో మునిగిపోయాయి. అణు విద్యుత్ కేంద్రాల వద్ద పరిస్థితిని నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ప్రాణనష్టంపై స్పష్టమైన సమాచారం రాకపోయినప్పటికీ, ఆస్తి నష్టం భారీగా ఉండొచ్చని అంచనా.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

