హైదరాబాద్‌లో విచిత్రం..పిండం పెట్టడం కోసం కాకి కొనుగోలు
హైదరాబాద్‌లోని పురానాపూల్ శ్మశానవాటికలో ఓ విచిత్రం జరిగింది. దశదిన కర్మ సందర్భంగా పెట్టిన పిండాన్ని ముట్టడానికి కాకులు రాలేదు. ఓ కుటుంబం పురానాపూల్ శ్మశానవాటికలో పెద్ద కర్మ కార్యక్రమం నిర్వహించింది. ఆచారం ప్రకారం పిండ ప్రదానం చేసి కాకుల కోసం గంటల తరబడి ఎదురుచూశారు. అయితే, తీవ్రమైన ఎండల కారణంగా ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించలేదు. సమయం గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనపడ్డారు.
చివరికి వారు ఓ వింత నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోని ముర్గి చౌక్‌కు వెళ్లి, అక్కడ ఓ కాకిని కొని తీసుకువచ్చారు. ఆ కాకితో పిండం ముట్టించి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఈ ఘటన వేసవి తాపం కేవలం మనుషులనే కాకుండా పక్షులు, ఇతర జీవజాలాన్ని కూడా ఎంతలా ఇబ్బంది పెడుతోందో తెలియజేస్తోంది. ఓ కుటుంబం ఏకంగా ఒక కాకిని కొని తమ ఆచారాన్ని పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. తీవ్రమైన ఎండల ప్రభావం సంప్రదాయ కార్యక్రమాలపై కూడా ఎలా పడుతోందో ఈ ఘటన తెలియచేసింది. హిందూ సంప్రదాయంలో పితృకార్యాల సమయంలో కాకికి పిండం పెట్టడం చాలా ముఖ్యమైంది. కాకిని పితృదేవతల రూపంగా భావిస్తారు. కాకి పిండాన్ని స్వీకరిస్తే, పితృదేవతల ఆత్మ శాంతించినట్లు, వారు సంతృప్తిగా ఉన్నట్లు నమ్ముతారు. అయితే, పిండాన్ని బలవంతంగా కాకితో ముట్టించడం శాస్త్రసమ్మతం కాదని, అది సహజంగా జరగాల్సిన ప్రక్రియ అని పండితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిండాన్ని ఆవుకు తినిపించడం లేదా నదిలో కలపడం వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయని వారు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

