జాగ్రత్త :వచ్చే 4 రోజులు గండమే.. దంచి కొట్టనున్న వర్షాలు!
తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతల నడుమ క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మరో 2-3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు, ఈదురుగాలులు సంభవిస్తాయి. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మధ్య తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిడుగుపాట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 39 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తూర్పున బంగాళాఖాతం నుండి, పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తేమ గాలులు ప్రవేశించడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావంతో వచ్చే రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలకు, పశ్చిమ తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు, అలాగే తూర్పున ఖమ్మం, భద్రాద్రి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వర్ష సూచన ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

