AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీతాలే ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు…అభివృద్ధి పక్కనపెట్టి ఉచితాలకు పెద్దపీట వేస్తున్న పార్టీలు..

అప్పుల ఊబిలో చిక్కుకుని, తిరిగి బైటికి రాలేక, తలెత్తుకుని బతకలేక దివాలా తీసి మన దేశంలో 8 వేల మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక ఫైనాన్స్ రిసెర్చ్ కంపెనీ వేసిన లెక్క ఇది. 2019లో ఐదున్నరవేలు, 2020లో ఆరువేలున్న రుణ బలవన్మరణాల సంఖ్య గత ఏడాది ఏకంగా 8 వేలకు చేరింది. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడుల్లోనే రుణపాశం వెంటాడి ఆత్మహత్యలు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఇలా అప్పుల నొప్పులు కేవలం మనకేనా, మనల్ని పాలించే ప్రభుత్వాలకు లేవా అంటే, ఎందుకులేవు? ఇంతకంటే భయంకరంగా ఉంటాయ్. కాకపోతే ఆ నొప్పిని తర్వాతి బడ్జెట్లకు క్యారీ ఫార్వర్డ్ చేయడమో, నెక్ట్స్ వచ్చే ప్రభుత్వాల నెత్తిన రుద్దడమో చేసి చక్కా వెళ్లిపోతాయి. కానీ, అప్పును ఆషామాషీగా తీసుకుని, అలవోకగా అప్పులు చేసి, ఖజానాను నింపి, దాంతో కలిగే నొప్పిని బలవంతంగా దాచిపెడుతున్నారు పాలకులు. రేపటిరోజున ఎదురయ్యే దరిద్రాల్ని తెలివిగా మర్చిపోతున్నారు. కానీ, ఈ అప్పుల కొలిమి ఒక ఆటంబాబుగా మారి, ఎప్పుడో ఒకసారి పేలిపోవడమైతే పక్కా.

జీతాలే ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు...అభివృద్ధి పక్కనపెట్టి ఉచితాలకు పెద్దపీట వేస్తున్న పార్టీలు..
Indian states debt crisis
Jyothi Gadda
|

Updated on: Apr 22, 2026 | 10:02 PM

Share

వాళ్లు కడుపు చించుకున్నప్పుడు, ఏమిటీ బీదరుపులు అని అప్పట్లో తేలిగ్గా తీసుకున్నారు జనం. కానీ, అంకెల్లో చూస్తే వాళ్లు చెప్పింది అక్షర సత్యం.. నిష్టుర సత్యం అని క్లియర్‌గా తెలుస్తుంది. మన దేశంలో డజనుకు పైగా రాష్ట్రాలు గొంతుదాకా అప్పులు చేసి, పైసల కరువుతో అలమటించిపోతున్నాయ్. ఊబిలోంచి బైటికిరాలేక బిక్కచచ్చిపోతున్నాయ్. తమిళనాడు 9.6 లక్షల కోట్లు ఉత్తరప్రదేశ్ 8.6 లక్షల కోట్లు ఇవి కూడా చదవండి కారు సీటే టాయిలెట్‌గా మారితే? సరికొత్త ఐడియా.. ఇక లాంగ్ ట్రిప్స్ రుబ్బిన ఇడ్లీ, దోశ పిండి ఎన్ని రోజులు వాడోచ్చు! నిపుణులు చెప్పేది నిమ్మ సాగుతో లక్షల ఆదాయం! ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు కాసుల వర్షమే బొప్పాయి ఆకులతో నేచురల్ పెస్టిసైడ్! ఖర్చు లేకుండా పంటలకు రక్ష! మహారాష్ట్ర 8.1 లక్షల కోట్లు కర్నాటక 7.3 లక్షల కోట్లు వెస్ట్‌బెంగాల్ 7.1 లక్షల కోట్లు రాజస్థాన్ 6.4 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్‌ 5.6...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి