రాత్రిపూట ఒంటరిగా నడిచా.. ఏమైందంటే..
హైదరాబాద్ లో మహిళల భద్రతపై ఓ యువతి అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లీషా అనే యువతి రాత్రిపూట నగరంలో ఒంటరిగా నడిచిన తన అనుభవాన్ని చెబుతూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. భాగ్యనగరం మహిళలకు అత్యంత సురక్షితమైన నగరమని ఆమె తన వీడియోలో కొనియాడింది.ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన లీషా, ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటికి ఒంటరిగా దాదాపు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో తనకు వేధింపులు, ఈవ్ టీజింగ్ లాంటివి ఎదురుకాలేదనీ ఎంతో సురక్షితంగా అనిపించిందని తెలిపింది. హైదరాబాద్ రాకముందు, ముంబైలో స్థిరపడాలని కలలు కన్నానని, హైదరాబాద్‌ను ఒక పాత నగరంగానే భావించానని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే, ఇక్కడికి వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని లీషా తెలిపింది. హైదరాబాద్ చూడటానికి చాలా అందంగా ఉందనీ సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయనీ ప్రజలు ఎంతో మర్యాదగా ఉంటారనీ పగలు కాస్త వేడిగా ఉన్నా, రాత్రి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుందని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్‌ను తప్పకుండా సందర్శించాలని ఆమె అందరికీ సలహా ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది సమయంలోనే వైరల్ అయింది. నెటిజన్ల నుంచి దీనిపై భిన్నమైన స్పందనలు వచ్చాయి. చాలామంది ఆమె మాటలతో ఏకీభవించారు. “నేను కూడా ఇటీవలే హైదరాబాద్ వచ్చాను, మీరు చెప్పింది నిజం” అని ఒకరు కామెంట్ చేయగా, “ఒక్కసారి హైదరాబాద్ వస్తే, మళ్లీ వదిలి వెళ్లలేరు” అని మరొకరు రాశారు. చాలా మంది హైదరాబాద్‌ను “అద్భుతమైన నగరం” అంటూ ఆమె అభిప్రాయాన్ని సమర్థించారు. హైదరాబాద్ గురించి ఎవరైనా మంచిగా మాట్లాడినప్పుడు తనకు వ్యక్తిగతంగా ప్రశంసలు వచ్చినట్టే అనిపిస్తుందని ఓ నెటిజన్ అన్నాడు. మరికొకరు భావోద్వేగంగా..‘ప్రతి భారతీయ నగరం, ప్రతి రహదారి ఇలా ఉండాలి. మనమందరం దానికి అర్హులం. కొనసాగించండి హైదరాబాద్’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియో కేవలం అర్థరాత్రి నడక రీలే కాదు.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

