అది క్రికెట్ గ్రౌండా?క్షుద్రపూజల వేదికా?
క్రికెట్ అంటే మన దేశంలో ఒక వ్యసనం. ఐపీఎల్ అంటే ఒక పండగ. కానీ, సోమవారం నాడు ఉప్పల్ స్టేడియంలో జరిగిన దృశ్యాలు చూస్తే.. ఇది క్రికెట్ మ్యాచా లేక మరేదైనా క్షుద్ర పూజల వేదికా అనిపించక మానదు. సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆనందం ఒకవైపు ఉంటే.. గ్యాలరీలో ఒక అభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిమ్మకాయలు, మంత్రాలు, వికెట్లు.. ఇంతకీ ఆరోజు అసలు ఏం జరిగింది? నిజంగానే ఐపీఎల్ లో చేతబడి జరుగుతోందా? లలిత్ మోదీ చేసిన ఆ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం.
“శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియం ఆరెంజ్ ఆర్మీ కేకలతో దద్దరిల్లింది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను 10 పరుగుల తేడాతో మట్టికరిపించి సన్ రైజర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ (59), విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (59) చెలరేగడంతో భారీ స్కోరు సాధ్యమైంది. లక్ష్య ఛేదనలో చెన్నై గట్టిగానే పోరాడింది కానీ, హైదరాబాద్ బౌలర్ ఇషాన్ మలింగా 3 వికెట్లతో చెన్నై వెన్ను విరిచాడు. చివరికి సిఎస్కే 184 పరుగులకే పరిమితమైంది.మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగుతున్న వేళ.. సీఎస్కే బ్యాటర్ శివమ్ దూబే క్రీజులో పాతుకుపోయాడు. ఆ సమయంలో గ్యాలరీలో ఉన్న ఒక ఎస్‌ఆర్‌హెచ్ అభిమాని కెమెరా కంటికి చిక్కాడు. అతని చేతిలో నిమ్మకాయ ఉంది, ఏదో మంత్రాలు చదువుతున్నట్లుగా గొణుగుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతను మంత్రం చదివి గాలిలోకి నిమ్మకాయను చూపించిన మరుక్షణమే, సాకిబ్ హుస్సేన్ వేసిన బంతికి శివమ్ దూబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు!
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
అది క్రికెట్ గ్రౌండా?క్షుద్రపూజల వేదికా?
తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విలయం..ఇటు వడగళ్ల వాన, అటు వడగాల్పుల
భారత్‌లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..
వస్తువులొద్దు.. జ్ఞాపకాలు కావాలంటున్న జెన్ జీ
పరిశోధనలో బయటపడిన 2,000 ఏళ్ల నాటి 'మెషిన్ గన్'
మభ్యపెట్టి చిన్నారిని తీసుకెళ్లిన కామాంధుడు.. ఆ తర్వాత
తుపాకులతో బ్యాంకుకు వచ్చారు.. 20 నిమిషాల్లో దోచేశారు

