Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయింది.. ప్లాట్ ఫామ్ మీద నిద్రపోయింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్

ఇప్పుడు హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను అందుకుంటున్నారు. అంతే కాదు కొంతమంది హీరోయిన్స్ అవ్వకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కున్న తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకొని.. వచ్చిన ఛాన్స్ లను సద్వినియోగం చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు.

చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయింది.. ప్లాట్ ఫామ్ మీద నిద్రపోయింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 18, 2025 | 7:42 PM

సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. సెలబ్రెటీల ఫోటోలు అయితే లెక్కేలేదు. కాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. పై  ఫోటోలో ఎంతో పద్దతిగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె… లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అదరగొట్టేస్తుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ముక్కు సూటిగా మాట్లాడే తత్వం ఆమెది.. అదే ఆమెకు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అంతేకాదు ఇండస్ట్రీలోని నెపోటిజం పై ఎన్నోసార్లు విమర్శలు గుప్పించింది. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి సినీరంగంలో అగ్ర కథానాయికగా ఎదిగింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

చదువు మధ్యలోనే మానేసి 15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయింది ఆమె. ఉండేందుకు చోటు లేకపోవడంతో ఫ్లాట్ ఫామ్ పై జీవించింది. ఇండస్ట్రీలో అవకాశాలను ఒడిసిపట్టుకుని ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే ఆమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు. ఇన్నాళ్లు వెండితెరపై అలరించిన ఆమె ఇప్పుడు పార్లమెంట్ లో అడుగుపెట్టింది. తనే బీటౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరిక. అందుకు తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో 15 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి ముంబైకి పారిపోయింది కంగనా. కొన్ని రోజులు చిన్న పనులు చేస్తూ ఫ్లాట్ ఫామ్ పై నిద్రపోయింది. 19 ఏళ్ల వయసులో నటిగా తొలి అవకాశం అందుకుంది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ చిత్రంతో కంగనా బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె నటనకు ప్రసంసలు అందుకుంది. ఆ తర్వాత ఫ్యాషన్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. హిందీలో క్వీన్, మణికర్ణక, తను వెట్స్ మను వంటి చిత్రాలతో స్టార్ డమ్ అందుకుంది.  తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది కంగనా. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆమె నటించిన తను వెడ్స్ మను సినిమా రూ.100 కోట్లు దాటిన తొలి హీరోయిన్ సెంట్రిక్ సినిమాగా నిలిచింది.  ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ముక్కుసూటిగా మాట్లాడడంతో బాలీవుడ్ పెద్దలు ఆమెను దూరం పెట్టారు. ఆమెకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. దీంతో తనే నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తుంది. ఇప్పుడు బీజీపీ పార్టీలో చేరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఆమె ఎంపిగా పోటీ చేసి ఘన విజయం సాధించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భానుడి భగభగలు.. ఏపీలో ఆ జిల్లాలోనే అత్యధికం!
భానుడి భగభగలు.. ఏపీలో ఆ జిల్లాలోనే అత్యధికం!
మిత్రుడి మరణం.. తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించిన ఏనుగు..
మిత్రుడి మరణం.. తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించిన ఏనుగు..
బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో మైండ్ బ్లాక్ చేస్తున్న రంగస్థలం బ్యూటీ
బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో మైండ్ బ్లాక్ చేస్తున్న రంగస్థలం బ్యూటీ
జాక్‌పాట్‌ కొట్టిన గోల్డ్‌ బాండ్స్‌ ఇన్వెస్టర్లు.. మూడింతల లాభం!
జాక్‌పాట్‌ కొట్టిన గోల్డ్‌ బాండ్స్‌ ఇన్వెస్టర్లు.. మూడింతల లాభం!
అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టేసిన స్త్రీ
అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టేసిన స్త్రీ
చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో
చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో
వయ్యారాలతో మతిపోగొడుతున్న ఆర్జీవీ హీరోయిన్..
వయ్యారాలతో మతిపోగొడుతున్న ఆర్జీవీ హీరోయిన్..
అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో
అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో
ఎండాకాలం వచ్చింది.. ఏటవుతుందో.. భయపెడుతున్న బండరాయి
ఎండాకాలం వచ్చింది.. ఏటవుతుందో.. భయపెడుతున్న బండరాయి
కస్టడీలో నన్ను లైంగికంగా వేధిస్తున్నారు..!
కస్టడీలో నన్ను లైంగికంగా వేధిస్తున్నారు..!