Pawan Kalyan: సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరాతో మహా కుంభమేళాలో పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్.. సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. వీరితో పాటు టాలీవుడ్ దర్శకుడు పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్.. సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. వీరితో పాటు టాలీవుడ్ దర్శకుడు పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా పవన్‌తో పాటు కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కుంభమేళాలో తొక్కిసలాటలు, అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కు పుణ్యస్నానం పూర్తయ్యే వరకూ రక్షణగా నిలిచారు.
తాజాగా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. యూపీలోని యోగీ ప్రభుత్వం కుంభమేళాకు ఏర్పాట్ల బాగా చేసిందని పవన్ అభినందించారు. సంస్కృతి, భాషాపరంగా భారతీయులు వేర్వేరు అయినప్పటికీ ధర్మంపరంగా అంతా ఒక్కటేనని పవన్ అన్నారు. దానికి ప్రతిబింబం కుంభమేళా అని తెలిపారు. కుంభమేళాలో పాల్గొనడం తన అదృష్టమని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ నెల 26తో కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ప్రయాగ్ రాజ్‌కు వెళ్లి పుణ్యస్నానాలు చేసేందుకు బయలుదేరి వెళ్తున్నారు. ఇదే క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు కూడా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారు.