AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwambhara: విశ్వంభర సినిమాలో ఊహించని గెస్ట్‌లు.. మెగాస్టార్ సినిమాలో రియల్ బావ, మరదలు

చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ సినిమా విశ్వంభర. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని నెలలుగా మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలారోజుల మెగా ఫ్యా్న్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Vishwambhara: విశ్వంభర సినిమాలో ఊహించని గెస్ట్‌లు.. మెగాస్టార్ సినిమాలో రియల్ బావ, మరదలు
Vishwambhara
Rajeev Rayala
|

Updated on: Feb 17, 2025 | 8:29 AM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను భారీ విజువల్ వండర్ గ తెరకెక్కిస్తున్నాడు వశిష్ఠ. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అలాగే ఆమధ్య విడుదల చేసిన   గ్లింప్స్ సినిమా పై ఆసక్తిని రెట్టింపు చేసింది. కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ కోసం చాలా కాలంగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇప్పుడు విశ్వంభ నుంచి ఓ లీక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మెగా హీరో, మెగా హీరోయిన్ కూడా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. విశ్వంభర సినిమాలో మెగా బావ మరదళ్లు సాయి ధరమ్ తేజ్, నిహారిక గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. నిహారిక గతంలో చిరు సైరా సినిమాలో చిన్న పాత్ర చేసింది. అలాగే తేజ్ ఇప్పటివరకు మెగాస్టార్ తో కలిసి నటించలేదు. ఈ ఇద్దరూ ఇప్పుడు విశ్వంభర సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. దీని పై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక విశ్వంభర సినిమాను దర్శకుడు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. అప్పట్లో ఆ సినిమా చూసి అభిమానులు ఎంత థ్రిల్ అయ్యారో ఇప్పుడు విశ్వంభర సినిమాకు కూడా అదే ఫీలింగ్ కలిగేలా ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషన్స్ ను రంగంలోకి దింపారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మరికొంతమంది భామలు కూడా కనిపించనున్నారట. అలాగే ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..