నన్ను టార్గెట్ చేశారు.. హిట్ కొట్టినా ఆఫర్స్ ఇవ్వడం లేదు.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా మంది ఈగర్ గా ఎదురుచూస్తూ ఉంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇంకొంతమంది మాత్రం సినిమా ఛాన్స్ ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఓ హీరోయిన్ మాత్రం తనను టార్గెట్ చేశారని తెలిపింది.

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం మాటలు కాదు. ఒక్క అవకాశం వస్తే చాలు తమను తాము నిరూపించుకోవడం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ సినిమాల్లో అవకాశాలకోసం సినిమా ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతుంటారు. ఇక కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు కొంతమంది కావాలనే అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కావాలనే తనను టార్గెట్ చేశారని, హిట్ వచ్చినా కూడా తనకు అవకాశాలు రాకుండా చేశారని తెలిపింది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరు.? ఎందుకు ఆమెకు అవకాశాలు రాలేదు.
సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది.. కానీ అనుకున్న అవకాశాలు అందుకోలేకపోతుంది. ఆమె పేరు పార్వతి తిరువోతు. మలయాళ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకి మంచి క్రేజ్ ఉంది. తన నటనతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది పార్వతి తిరువోతు. ఒకానొక ఈ చిన్నదాని బ్యాన్ కూడా చేశారు. ఆతర్వాత తిరిగి సినిమాల్లో బిజీగా మారిపోయింది. పార్వతి మళయాళంతో పాటు కన్నడ, తమిళ్ తో పాటు హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది. అలాగే రెండు వెబ్ సిరీస్ లు చేసింది. అలాగే ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.
అయితే తనను కొందరు టార్గెట్ చేశారని, కావాలనే తనకు ఆఫర్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడే పార్వతి కొన్ని వివాదాల్లోనూ చిక్కుకుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంపై అడిగిన ప్రశ్నకు పార్వతి మాట్లాడుతూ.. “సినిమాల విషయంలో సెలెక్టివ్ గా ఉండడం ఒక కారణమైతే, కొంతమంది హీరోలతో నేను నటించనని చెప్పడం కూడా మరో కారణం అని తెలిపింది. అంతే కాదు మలయాళ ఇండస్ట్రీలో నేను ఎదుర్కున్న కొన్ని సమస్యల గురించి మాట్లాడటం వల్ల కూడా అవకాశాలు రావడం లేదు. విజయాలు అందుకున్నా..తక్కువ అవకాశాలు రావడానికి కారణం ఇదే. ముఖ్యంగా కొంతమందితో నేను నటించను అని చెప్పడం వల్ల నన్ను ఇండస్ట్రీ వాళ్ళు టార్గెట్ చేసి , అవకాశాలు ఇవ్వకుండా చేస్తున్నారు అని తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. హీరోలే కాదు సాంకేతిక నిపుణులు కూడా అవకాశాలు రాకుండా చేస్తారు అంటూ పార్వతి చెప్పుకొచ్చింది ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




