AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రేమికుల రోజే ప్రియుడితో కలిసి పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. వీడియో ఇదిగో

తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించిన ఈ క్రేజీ హీరోయిన్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన మనసుకు నచ్చిన వాడితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Tollywood: ప్రేమికుల రోజే ప్రియుడితో కలిసి పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. వీడియో ఇదిగో
Tollywood Actress
Basha Shek
|

Updated on: Feb 15, 2025 | 3:46 PM

Share

ప్రముఖ మోడల్ కమ్ హీరోయిన్ ప్రియా బెనర్జీ పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. 2013లో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన కిస్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైందీ అందాల తార. ఆ తర్వాత సందీప్ కిషన్ ‘జోరు’, నారా రోహిత్ అసుర సినిమాల్లోనూ నటించి తన అందం, అభినయంతో మెప్పించింది. అయితే విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. పెద్దగా క్రేజ్ కూడా రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ జజ్బా, 2016 ది ఎండ్, దిల్ జో నా కే సఖా, త్రిదేవ్ వంటి హిందీ సినిమాలతో అక్కడి ఆడియెన్స్ కు చేరువైంది. తమిళ్ లోనూ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక 2023లో రానా, వెంకటేష్ ల క్రేజీ వెబ్ సిరీస్ రానా నాయుడులో కీలక పాత్రలో మెరిసింది ప్రియా బెనర్జీ. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో మాత్రమ నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. బాలీవుడ్ స్టార్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ప్రేమికుల రోజే అంటే శుక్రవారం (ఫిబ్రవరి 14) వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, స్నేహితులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి

ప్రియా బెనర్జీ- ప్రతీక్ బబ్బర్ లది ప్రేమ వివాహం. గత కొన్నేళ్లుగా వీరు డేటింగ్ లో ఉన్నారు. ఇక తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను ప్రియా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దీంతో ఇవి కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ఇక ఈ పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ కొత్త దంపతులు పెళ్లి మండపంలోనే ముద్దుల్లో మునిగిపోయారు.

పెళ్లి దుస్తుల్లో ప్రియా బెనర్జీ, ప్రతీక్ బబ్బర్..

అతిథులకు స్వీట్లు పంచుతోన్న కొత్త దంపతులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.