AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివీల్.. రామ్ చరణ్ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? వీడియో

చాలామంది సెలబ్రిటీల్లాగే రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ కూతురి విషయంలో ఎంతో ప్రైవసీ పాటించారు. తమ బిడ్డ ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు రామ్ చరణ్ కూతురు ఫేస్‌ రివీలైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

Ram Charan: మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివీల్.. రామ్ చరణ్ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? వీడియో
Ram Charan Daughter Klin Kaara
Basha Shek
|

Updated on: Feb 14, 2025 | 11:32 PM

Share

మెగా ప్రిన్సెస్ క్లింకార కొణిదెల ముఖాన్ని చూడడానికి మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ చరణ్- ఉపాసన ఇప్పటివరకు తమ కూతురి ఫేస్‌ను కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికీ చూపించలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమ బిడ్డ ఫొటోలు షేర్ చేసినా ముఖం కనిపించకుండా బ్లర్ చేయడం లేదా ఎమోజీలతో ఫేస్ కవర్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక ఇటీవల ఆహా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకు హాజరైన రామ్ చరణ్ తనను నాన్న అని పిలిచిన తర్వాతే క్లింకార ఫేస్ ను అందరికీ చూపిస్తానన్నాడు. అయితే ఈ చర్చ జరిగి సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివీలైంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. రామ్ చరణ్ తన కూతురిని ఎత్తుకొని నిల్చున్న వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అవి కాస్తా క్షణాల్లోనే వైరల్ గా మారాయి. వీటిని చూసిన మెగాభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. క్లింకార సూపర్ క్యూట్ గా ఉందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన తర్వాతి సినిమాపై పూర్తిగా దృష్టి సారించాడు. గతంలో ‘ఉప్పెన’ వంటి అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ శిష్యుడు, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మున్నాభాయ్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా గేమ్ ఛేంజర్ తరహాలోనే ఆర్ సీ 16 సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.  ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.

కూతురు క్లింకారతో రామ్ చరణ్.. వీడియో ఇదిగో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి