AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prudhvi Raj: ‘వారిపై పరువు నష్టం దావా వేస్తా’.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన పృథ్వీరాజ్

లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన '150 మేకల్లో చివరకు 11' కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో నటుడు పృథ్వీపై వైస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతను వెంటనే క్షమాపణలు చెప్పాలని లేకుండా సినిమాను బాయ్ కాట్ చేస్తామని డిమాండ్ చేస్తున్నాయి.

Prudhvi Raj: 'వారిపై పరువు నష్టం దావా వేస్తా'.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన పృథ్వీరాజ్
Actor Prudhvi Raj
Basha Shek
|

Updated on: Feb 12, 2025 | 8:17 PM

Share

విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రి రీలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ పై వైఎస్సార్ సీపీ భగ్గుమంటోంది. పృథ్వీ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా #BoycotLaila ట్రెండ్ చేస్తోంది. ఇదే క్రమంలో నటుడు పృథ్వీ ఆస్పత్రిలో చేరడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత రెండు రోజులుగా వైఎస్సార్ సీపీ సోషల్‌ మీడియా వింగ్‌ తనను మానసికంగా వేధిస్తోందని పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులతో వచ్చిపోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఫోన్‌కాల్స్‌, మెస్సేజ్‌లతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా నెంబర్‌ సోషల్‌ మీడియా గ్రూప్‌లో ఉంచి 1800 కాల్స్‌ చేయించారు. మా అమ్మ, భార్య, పిల్లలను దారుణంగా తిట్టిస్తున్నారు. వారి వేధింపులు తాళలేక ఆసుపత్రిలో చేరాను. అనిల్‌ పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. త్వరలో ఈ విషయంపై ఏపీ హోంమంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాను. నన్ను ఇలా మానసికంగా వేధించిన వారిపై కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తాం’ అని పృథ్వీరాజ్ మీడియాతో తెలిపారు.

విశ్వక్‌సేన్‌ హీరోగా దర్శకుడు రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించిన చిత్రమే ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌. ఇందులో పృథ్వీ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్ గా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే పృథ్వీ చేసిన పొలిటికల్ కామెంట్స్ వివాదానికి దారి తీశాయి.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో పృథ్వీరాజ్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..
తలకాయ మాంసం మెత్తగా ఉడకాలంటే.. మధ్యలో ఇవి వేస్తే చాలు..
తలకాయ మాంసం మెత్తగా ఉడకాలంటే.. మధ్యలో ఇవి వేస్తే చాలు..
టోల్ ఛార్జీ రూల్స్‌లో మార్పులు.. వాహనదారులకు బిగ్ షాకింగ్
టోల్ ఛార్జీ రూల్స్‌లో మార్పులు.. వాహనదారులకు బిగ్ షాకింగ్
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై బిగ్‌ అలర్ట్.. అర్హులు వీరే!
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై బిగ్‌ అలర్ట్.. అర్హులు వీరే!
సైలెంటుగా ఉంటే పనవ్వదు.. ఆ ప్లేయర్లా అగ్రెస్సివ్ గా ఉండాల్సిందే
సైలెంటుగా ఉంటే పనవ్వదు.. ఆ ప్లేయర్లా అగ్రెస్సివ్ గా ఉండాల్సిందే
రాజ్యసభలో మోదీ ప్రసంగం
రాజ్యసభలో మోదీ ప్రసంగం
మానవులు కొండ చిలువ రక్తం తాగితే ఏం జరుగుద్దో తెలుసా? ఊహించని లాభం
మానవులు కొండ చిలువ రక్తం తాగితే ఏం జరుగుద్దో తెలుసా? ఊహించని లాభం
దివ్యభారతి చనిపోయే ముందు అసలేం జరిగిందంటే
దివ్యభారతి చనిపోయే ముందు అసలేం జరిగిందంటే
మీ చర్మం చందమామలా మెరిసిపోవాలా..? మీ వంటింట్లోనే ఉంది అసలు రహస్యం
మీ చర్మం చందమామలా మెరిసిపోవాలా..? మీ వంటింట్లోనే ఉంది అసలు రహస్యం
ప్రజలకు తెలంగాణ సర్కార్‌ భారీ గుడ్‌న్యూస్‌.. మరో సంచలన నిర్ణయం..
ప్రజలకు తెలంగాణ సర్కార్‌ భారీ గుడ్‌న్యూస్‌.. మరో సంచలన నిర్ణయం..