Sanjana Galrani: చిక్కుల్లో బుజ్జిగాడు హీరోయిన్.. ఆ కేసులో మళ్లీ జైలుకు వెళ్లక తప్పదా?
సంజనా గల్రానీ కన్నడ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిందీ అందాల తార. అలాగే పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించింది.

2005లో తరుణ్ నటించిన సోగ్గాడు సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది సంజనా గల్రానీ. ఆ తర్వాత ప్రభాస్ బుజ్జిగాడుతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. రాజశేఖర్ సత్యమేవ జయతే, శ్రీకాంత్ దుశ్శాసన, ముగ్గురు, యమహో యమహా, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇక సంచలన విజయం సాధించిన దండుపాళ్యం సినిమాల్లోనూ నెగెటివ్ పాత్రలో అద్భుతంగా నటించింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. న సంజన గల్రానీ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. ఆమె మూడు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించింది. అయితే బెయిల్‌పై బయటకు వచ్చింది. సంజనా అరెస్ట్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. అయితే ఇటీవల ఆ కేసును అక్కడి హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సీసీబీ పోలీసులు ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీని వలన సంజన గల్రానీ మళ్ళీ ఇబ్బందుల్లో పడే అవకాశముంది. ప్రభుత్వ స్థాయిలో ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించారు. అప్పీలుకు సంబంధించి పిటిషన్ ను కూడా సిద్ధం చేశారు. ప్రాసిక్యూషన్ అనుమతి వచ్చిన వెంటనే పిటిషన్ దాఖలు చేస్తాం’ అని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ అన్నారు. మరి ఈ విషయంపై సంజన ఎలా స్పందిస్తుందో చూడాలి.
సంజన గల్రానీ కన్నడ, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. కొన్నేళ్ల క్రితమే వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 2020 లాక్ డౌన్ సమయంలో బెంగుళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని పెళ్లి చేసుకున్న సంజన సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. 2022లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సంజన తమ ఫ్యామిలీకి పూర్తిగా టైమ్ కేటాయించింది.
భర్త, కుమారుడితో నటి సంజనా గల్రానీ..
View this post on Instagram
అలాగే సోషల్ మీడియాలోనూ సంజనా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫోటోస్, అలాగే తన బాబు ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ఇక పెళ్లి తర్వాత ఆమె సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. చివరిగా 2018 లో ‘దండుపాళ్యం 3’లో సంజనా గల్రానీ నటించింది. ఆ తర్వాత ఇంటికే పరిమితమైంది.
సంజనా గల్రానీ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.