AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకి సినీ తారలు కూడా క్యూ కడుతున్నారు. అక్కడ పవిత్ర త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం తమ కుంభమేళా పర్యటనకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Maha Kumbh Mela
Basha Shek
|

Updated on: Feb 10, 2025 | 9:39 PM

Share

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా అప్రతిహతంగా కొనసాగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ వేడుక ఈ నెల 26 వరకు జరగనుంది. 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కేవలం సామాన్యులే కాదు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా మహా కుంభమేళాలో భాగమవుతున్నారు. ప్రధానంగా సినీ తారలు పెద్ద ఎత్తున ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. విజయ్ దేవరకొండ, హేమ మాలినీ, సంయుక్త మేనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్, దిగంగన సూర్య వంశీ, రాజ్ కుమార్ రావు తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ సోనాల్ చౌహాన్ మహా కుంభమేళాను దర్శించుకుంది. సోమవారం (ఫిబ్రవరి 10) సంప్రదాయ దుస్తులు ధరించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించింది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి.

పేరకు బాలీవుడ్ నటి అయినా సోనాల్ చౌహాన్ తెలుగు ఆడియన్స్ కి చాలా సుపరిచితం. రెయిన్ బో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో బాలకృష్ణ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే పండగ చేస్కో, షేర్, ఎఫ్3, ది ఘోస్ట్, ఆది పురుష్ తదితర సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. అయితే క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాల్లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో సోనాల్ చౌహాన్.. ఫొటోస్ ఇదిగో..

అయితే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటో షూట్స్ తో తన ఫాలోవర్లను సర్ ప్రైజ్ చేస్తుంటుందీ అందాల తార.

సోనాల్ చౌహాన్ లేటెస్ట్  గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి