Mahesh Babu: మహేష్ 1 నేనొక్కడినే లండన్ బ్యూటీ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి సినిమాపైనే ఉంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి కొత్త సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘SSMB 29’ అని పేరు పెట్టారు. ఈక్రేజీ మూవీకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం వర్క్ షాప్ జరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. అడ్వెంచర్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే జరగనుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మహేష్ బాబు నటించిన సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న మూవీ 1 నేనొక్కడినే.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు రాక్ స్టార్ గా నటించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం 1నేనొక్కడినే సినిమాకే హైలెట్. అలాగే ఈ సినిమాలో లండన్ బాబు’ పాటలో క కనిపించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? ఈ సాంగ్ లో తన అందంతో ప్రేక్షకుల ను ఆకట్టుకుంది ఆ చిన్నది.
ఆ భామ పేరు సోఫియా చౌదరి. భారతదేశానికి చెందిన ఆమె బ్రిటిష్ గాయని, హోస్ట్, నటిగా రాణించింది సోఫియా. కాగా ఈ బ్యూటీ సినిమాల్లో పెద్దగా రాణించలేదు. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. 1 నేనొక్కడినే సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెప్పించింది. కాగా ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సోఫియా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా సోఫియా చౌదరి తన 41 పుట్టిన రోజును జరుపుకుంది. ఇందుకు సంబందించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి