అక్కడ సర్జరీ చేయించుకున్నా.. అద్దంలో చూసుకొని బాధపడ్డా.. ఎమోష్నలైన అషు రెడ్డి
అషూ రెడ్డి.. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోస్ ద్వారా చాలా పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి అక్కడ తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ గా మారింది. పలు టీవీ షోలలో పాల్గొంటూ చాలా బిజీ అయ్యింది. అంతేకాకుండా డైరెక్టర్ ఆర్జీవీతో అషురెడ్డి ఇంటర్వ్యూ నెట్టింట సెన్సెషన్ అయ్యింది.

హాట్ బ్యూటీ అషు రెడ్డి.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా పలు ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది ఈ క్రేజీ బ్యూటీ. ముఖ్యంగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ. దాంతో ఈ చిన్నదాని పేరు బాగా వైరల్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది.ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. బిగ్ బాస్ లో తనదైన ఆటతోపాటు అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆషు కొన్ని సినిమాల్లోనూ నటించింది.
చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ హీరోయిన్ గా మాత్రం చేయలేదు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీకి సినిమా ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఆమెకు అంతగా ఆఫర్స్ రాలేదు. బిగ్ బాస్ నుని బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు వరుసగా షోలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది ఈ హాట్ బ్యూటీ.
ప్రస్తుతం ఈ అమ్మడు మాస్టర్ పీస్ ఆమె సినిమాలో నటిస్తుంది. కాగా అషు రెడ్డి ముఖానికి సర్జరీ చేయించుకుంది ఆ మధ్య తెగ వార్తలు వినిపించాయి. కాగా ఓ ఇంటర్వ్యూలో ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న అషు రెడ్డి ఆసక్తికర విషయాన్నీ పంచుకుంది. తన తలకు సర్జరీ అయ్యిందని తెలిపింది. బ్రెయిన్‌కి ఆపరేషన్ చేయడం కోసం జుట్టు తీసేస్తాం అన్నారు. పూర్తిగా గుండు చేసినా పర్లేదు కానీ.. అరగుండు చెయ్యొద్దని చెప్పా.. సర్జరీ జరిగిన నాలుగు రోజుల తర్వాత ఫేస్‌లో ముఖం చూసుకుంటే నా కెరీర్ అయిపోయిందని అనుకున్నానని కన్నీళ్లు పెట్టుకుంది అషు రెడ్డి. ఆతర్వాత నెలరోజులకు తిరిగి కోలుకొని ఏదోలా జుట్టు సెట్ చేసుకున్నాను అని తెలిపింది. అషు కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి