బ్యాడ్ లక్ అంటే ఈ అమ్మడిదే..! యంగ్ హీరో సినిమా కోసం 1000కోట్ల సినిమాను మిస్ చేసుకుంది
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తలుపు తట్టడం అనేది చాలా అరుదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కొందరు హీరోయిన్. మరికొంతమంది మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. మరికొంతమంది ముద్దుగుమ్మలు డేట్స్ అడ్జెస్ట్ అవ్వక బడా సినిమాలను మిస్ అవుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అవకాశాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. దూసుకుపోతున్నారు. కొంతమంది స్టార్ హీరోల సినిమాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.అలాగే మరికొంతమంది. డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ యంగ్ హీరో సినిమా కోసం ఏకంగా రూ. 1000 కోట్ల భారీ సినిమా ఆఫర్ మిస్ చేసుకుంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? అవకాశం తలుపు తట్టడమే గొప్ప విషయం. కానీ ఈ అమ్మడి భారీ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకోవడంతో అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ఇంతకూ ఆ అమ్మడు ఎవరు.? ఆమె మిస్ చేసుకున్న భారీ బడ్జెట్ మూవీ ఏది.? ఒక్కసారి చూద్దాం.!
యంగ్ హీరో సినిమా కోసం భారీ బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో కాదు. లైగర్ బ్యూటీ అనన్య పాండే. బాలీవుడ్ లో ఈ భామ క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. తన అందాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ వయ్యారి. ఇక తెలుగులో అనన్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో పరిచయం అయ్యింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. ఇటీవలే ఆమె తండ్రి లైగర్ సినిమాను అనన్య అయిష్టంగానే ఒప్పుకుందని షాకింగ్ కామెంట్స్ చేశారు .
అనన్య నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఆమె చేసిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దాంతో ఓ భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తెరకెక్కిస్తున్న సినిమాలో ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్ లో ఇంతియాజ్ అలీ ప్రేమకథలు తెరకెక్కించడంలో దిట్ట. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ నటీనటులు ఎదురుచూస్తారు. ఇంతియాజ్ అలీ ఓ భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా అనన్యను అనుకున్నారట. అయితే కార్తీక్ ఆర్యన్ సినిమా షూటింగ్ లో ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాక ఇంతియాజ్ అలీ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఇప్పుడు ఇదే వార్త బాలీవుడ్ లో జోరుగా షికారు చేస్తుంది.
View this post on Instagram
అనన్య పాండే ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి